మాస్ కా దాస్ విశ్వక్సేన్ “కల్ట్”తో రాబోతున్నారు. విభిన్నమైన కథాంశాలతో ప్రయోగాలు చేసే విశ్వక్ ఈ చిత్రంలో నటించడంతోపాటు దర్శకత్వం, కథ, స్క్రీన్‌ప్లే కూడా రాస్తూ ప్రాజెక్ట్ పూర్తి బాధ్యతలను తీసుకున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్, యజ్ఞ తుర్లపాటి, కబీర్ భారతీయ, విశాఖ్ నాయర్, చెపూరి వివేక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు!!

