HomeEntertainmentనిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ‘పాకెట్ రాకెట్స్’...

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ‘పాకెట్ రాకెట్స్’ నుంచి ‘ది ఫ‌స్ట్ హ్యాండ్’ రిలీజ్‌..క్యూరియాసిటీ పెంచుతోన్న టీజ‌ర్‌

- Advertisment -

శ్రీలంక‌లో అంద‌మైన రిసార్ట్ నుంచి ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తోన్న ఓ యువ‌కుడు ‘ఈ ఫీలింగ్ ఏంట్రా ఇలా ఉంది.. కల కంటే రియాలిటీనే ఫ‌స్ట్ టైమ్ బావుంది’ అని అంటాడు. దానికి మ‌రొక‌డు ‘డోంట్ టాక్ టు మీ తెలుగు లైక్ లోక‌ల్ బ‌స్తీ గ‌య్స్‌.. ఐయామ్ ది ఓన‌ర్ ఆఫ్ ..’ అంటూ డైలాగ్ చెబుతాడు. అక్క‌డ నుంచి గ్యాంబ్లింగ్ జ‌రిగే ప్ర‌దేశాన్ని చూపిస్తారు.

బ‌స్తీలో ఉండే ఇద్ద‌రు కుర్రాళ్లు చ‌దువుకుంటూ బ‌త‌కు వెళ్ల‌దీయ‌టానికి చాలా క‌ష్టాలు ప‌డుతుంటారు. ఇక జీవితం ఎప్పుడు బాగుప‌డుతుందా! అని ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ల జీవితంలో ఓ అంద‌మైన అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు వాళ్ల లైఫ్స్ ఎలాంటి మ‌లుపులు తీసుకున్నాయి.

ఆ అమ్మాయి.. ఇద్ద‌రి ఫ్రెండ్స్‌ని శ్రీలంకకి ఎందుకు పంపిస్తుంది. అక్క‌డ నుంచి వాళ్ల జీవితాలు ఎలాంటి మ‌లుపు తీసుకుంటుంది అనేది తెలుసుకోవాలంటే ‘పాకెట్ రాకెట్స్’ చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాత‌లు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో న‌టిస్తున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా నుంచి మంగ‌ళ‌వారం రోజున ది ఫ‌స్ట్ హ్యాండ్ అంటూ టీజ‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్‌లోకి దిగడం..అక్క‌డ వాళ్ల‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి క్యారెక్ట‌ర్ ప‌రిచ‌యం.. అక్క‌డి నుంచి క‌థ‌లో కీల‌క మ‌లుపులు.. వీట‌న్నింటిని క‌ల‌గ‌లిపిన ఫ‌స్ట్ హ్యాండ్ టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. ప్ర‌స్తుతానికి సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా వర్క్ చేయనున్నారు. ఈ మూవీకి గ్యానీ సంగీతాన్ని అందించనున్నారు.

ఈ సినిమాలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్లు ఫేమ్), శ్రియా కొంతం (శుభం ఫేమ్), నిర్మల్ (డెబ్యూ హీరో), జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తున్నారు.

బ్యానర్స్‌: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్
నిర్మాతలు: పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి
దర్శకుడు :రుద్ర అత్రి
కెమెరామెన్ :ఎదురోలు రాజు
మ్యూజిక్ :గ్యానీ
ఎడిటర్ : అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ మన్యం
ప్రొడక్షన్ డిజైనర్ :విష్ణు వర్దన్ పుల్లా
యాక్షన్ కొరియోగ్రఫీ :రాజేష్ లంకా
కొరియెగ్రాఫర్ : జేడీ మాస్టర్
కాస్ట్యూమ్ డిజైనర్ : అనుషా దేవర
ఎస్ఎఫ్ఎక్స్ :సాయి మనీంధర్ రెడ్డి
కో డైరెక్టర్ :మురళీ కృష్ణ కట్టా
మేకప్ చీఫ్ :పసుపులేటి రవి కుమార్
కాస్ట్యూమ్ చీఫ్ :ఆర్. భూపాల్ రావు
ప్రొడక్షన్ కంట్రోలర్ : రవిందర్ బెక్కం
స్టిల్స్ : వరాహాల మూర్తి
ఈవెంట్ పార్టనర్: యువి మీడియా
మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ
పీఆర్వో : ఎస్.కె. నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments