
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలు. డిసెంబర్ 11న సినిమా విడుదలకానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా నుంచి మంగళవారం రోజున ది ఫస్ట్ హ్యాండ్ అంటూ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో..
నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’ చిత్రాన్ని జులైలో ప్రారంభించాం. రుద్రతో మాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. అంజి, ఏసు, జేడీ గారి పాత్రలు అద్భుతంగా ఉంటాయి. ఆరు నెలల్లో సినిమాని పూర్తి చేసి, రిలీజ్ చేస్తున్నాం. డిసెంబర్ 11న మా చిత్రం రాబోతోంది. ఇక రిలీజ్ వరకు మేమంతా మీ సోషల్ మీడియాలోకి, మీ ఇంట్లోకి వచ్చేస్తాం’ అని అన్నారు.
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’ సినిమా కోసం నేను అక్టోబర్‌లో షూట్ చేశాను. నవంబర్‌లో టీజర్ అన్నారు, డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారు. నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ని చూడలేదు. ఈ సినిమా స్కేల్‌ని మన్యం రమేష్ గారు పెంచారు. రుద్ర గారు ఏం తీశారు, ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లోనే చూసి తెలుసుకోండి. ఈ సినిమా డిసెంబర్ 11న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
నిర్మాత రాహుల్ రాఘవేంద్ర మాట్లాడుతూ .. ‘మేం డిజిటల్ కంటెంట్ చేసేవాళ్లం. మాకు ఇదే తొలి చిత్రం. నిహారిక గారితో మేం కలిసి ఈ సినిమాని నిర్మించాం. రుద్ర గారు చెప్పిన స్క్రిప్ట్ మాకెంతో నచ్చింది. ‘పాకెట్ రాకెట్స్’ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. పాకెట్లో ఉన్న ఫోన్ తీసి తీయకుండా రెండు గంటల సేపు అలరించేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
దర్శకుడు రుద్ర అత్రి మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’ టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. నాకు ఇంతలా సపోర్ట్ చేసిన నిహారిక గారికి థాంక్స్. నా టీం ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమాని ఇంత వేగంగా పూర్తి చేయగలిగాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ గ్యానీ మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’ టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సినిమా బాగా వచ్చింది. అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. డిసెంబర్ 11న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
త్రినాథ వర్మ మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’లో నేను అంజి అనే పాత్రలో కనిపిస్తాను. జీవితాన్ని మార్చుకోవాలని, అవకాశం రావాలని తపన పడే కుర్రాడి పాత్ర. నా జీవితంలోని పాత్రకు కనెక్ట్ అయ్యాను. నన్ను మళ్లీ హీరోగా నిలబెట్టిన నిహారిక గారు, మన్యం రమేష్ గారికి థాంక్స్. ఇద్దరు కుర్రాళ్లు తమ జీవితాల్ని బాగు పర్చుకునేందుకు ఏం చేశారు అన్నది ఈ చిత్రంలో చూపించాం. జేడీ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన వల్ల మేం ఎంతో నేర్చుకున్నాం. మాకు సపోర్ట్ చేసిన రాహుల్ భయ్యాకి థాంక్స్. డిసెంబర్ 11న మా చిత్రం రాబోతోంది. అందరూ చేయండి’ అని అన్నారు.
నిర్మల్ మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’ నాకు తొలి చిత్రం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిహారిక గారు, రుద్ర గారికి థాంక్స్. ఈ టీం నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మా మూవీ డిసెంబర్ 11న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
శ్రియా కొంతం మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’ చిత్రంలో నేను హారిక అనే పాత్రను పోషించాను. ఆ కారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇంత మంచి చిత్రంలో ఇలాంటి మంచి పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. నిహారిక గారి ప్రొడక్షన్లో పని చేయడం సంతోషంగా ఉంది. రుద్ర సర్ ఫస్ట్ మూవీలో అవకాశం రావడం గ్రేట్. సినిమా టీజర్‌కి పది రెట్లు ఉంటుంది. డిసెంబర్ 11న మా సినిమాని అందరూ చూడండి’ అని అన్నారు.
ఎడిటర్ అన్వల్ అలీ మాట్లాడుతూ .. ‘నిహారిక గారు డిఫరెంట్ చిత్రాల్ని నిర్మిస్తూ ఉన్నారు. ‘పాకెట్ రాకెట్స్’ సినిమా బాగా వచ్చింది. ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉండబోతోంది. డిసెంబర్ 11న మా మూవీ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
నటీనటులు:
త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్లు ఫేమ్), శ్రియా కొంతం (శుభం ఫేమ్), నిర్మల్ (డెబ్యూ హీరో), జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తున్నారు.
బ్యానర్స్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్
నిర్మాతలు: పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి
దర్శకుడు :రుద్ర అత్రి
కెమెరామెన్ :ఎదురోలు రాజు
మ్యూజిక్ :గ్యానీ
ఎడిటర్ : అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ మన్యం
ప్రొడక్షన్ డిజైనర్ :విష్ణు వర్దన్ పుల్లా
యాక్షన్ కొరియోగ్రఫీ :రాజేష్ లంకా
కొరియెగ్రాఫర్ : జేడీ మాస్టర్
కాస్ట్యూమ్ డిజైనర్ : అనుషా దేవర
ఎస్ఎఫ్ఎక్స్ :సాయి మనీంధర్ రెడ్డి
కో డైరెక్టర్ :మురళీ కృష్ణ కట్టా
మేకప్ చీఫ్ :పసుపులేటి రవి కుమార్
కాస్ట్యూమ్ చీఫ్ :ఆర్. భూపాల్ రావు
ప్రొడక్షన్ కంట్రోలర్ : రవిందర్ బెక్కం
స్టిల్స్ : వరాహాల మూర్తి
ఈవెంట్ పార్టనర్: యువి మీడియా
మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ
పీఆర్వో : ఎస్.కె. నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
