- దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమా విశేషాలు పంచుకున్నారు.
-ఈ కథకు నిజ జీవిత సంఘటన, కొన్ని పాత్రలు, అలాగే ఫిక్షన్.. ఈ మూడు ఉన్నాయి. మా అమ్మగారు ఆడపిల్ల పుడితే బాగుంటుందని భావించారు. కానీ పుట్టలేదు. నాకే జడలు వేసి, గౌన్లు వేసి పెంచారు. నా రెండో క్లాస్ వరకు నాకు జడలు ఉండేవి. జడలు అక్కడి నుంచి తీసుకున్నాను. దీని వెనుక కూడా చాలా ఎమోషన్ ఉంటుంది.
- ఇందులో ఉండే రెవల్యూషన్, ఆ పాత్రలను నేను పుట్టి పెరిగిన గోదావరిఖని ప్రాంతం నుంచి స్ఫూర్తి పొందినవి. ఆదిలాబాద్, గోదావరిఖని ప్రాంతాల మధ్యలో జరిగిన సంఘటనలు తీసుకున్నాను. నేను సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌లో ఉన్నాను. ఆ పక్కన ఉండే బస్తీలో జరిగే కథలాగా డిజైన్ చేశాను.
‘దసరా’ని ఒక మంచి డ్రామాగా చేయాలనేది నా ఉద్దేశం. కాకపోతే ప్రమోషనల్ కంటెంట్ చూసి అదొక ‘కేజీఎఫ్’లా చాలా మాస్‌గా ఉంటుందని అనుకున్నారు. థియేటర్లోకి వెళ్లి చూసిన తర్వాత ప్యూర్ డ్రామా ఉంది. ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యారని నాకు ఫీడ్‌బ్యాక్ వచ్చింది.
అప్పుడు ఆడియన్స్ కోరుకునేది తీస్తే అది కమర్షియల్‌గా హై ఫీల్ అవుతారు కదా అని అనిపించి, అలా నాని గారి దగ్గరికి వెళ్లి ఈ ఆలోచన చెప్పాను. ఆడియన్స్ కోరుకునేది ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిందే ‘ప్యారడైజ్’
-‘ప్యారడైజ్’లో యాక్షన్, ఎమోషన్స్, మదర్ అండ్ సన్ ఎమోషన్ అన్నీ కూడా బ్లెండ్ అయి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే యాక్షన్ కంటే ఎమోషన్ డామినేట్ చేస్తుందని భావిస్తున్నాను. ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు ఎమోషన్‌కు చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతారు!!

