HomeEntertainmentమరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న సుకుమార్ ముద్దుల తనయ

మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న సుకుమార్ ముద్దుల తనయ

- Advertisment -

పుష్ప, పుష్ప-2 చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొంది. ఇటీవల జాతీయ అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఘనత పొందిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బాటలోనే ఆయన తనయ సుకృతి వేణి బండ్రెడ్డి పయనిస్తున్నారు. 2024 సంవత్సరానికి జాతీయ ఉత్తమ బాల నటిగా ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికిగాను అవార్డు సాధించిన సుకృతి వేణి ఇప్పుడు మరో అరుదైన ఘనతను కైవసం చేసుకుంది. అమెరికాలోని బోస్టన్‌ కి చెందిన “అంతర్జాతీయ బర్క్‌లీ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ స్కూల్‌ సంగీత విభాగంలో ఎన్‌సెంబల్‌ ఎక్సెలన్స్‌ అవార్డును ఎంపికై ఫుల్‌ స్కాలర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. బోస్టన్ లోని “బర్కెలీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్” లో వచ్చే ఏడాది సమ్మర్ మ్యూజిక్ ప్రోగ్రాం కోసం ఫుల్ స్కాలర్ షిప్ వచ్చింది. ఈ స్కాలర్ షిప్ కోసం మొత్తం 272 మంది పిల్లలు ఆడిషన్ ఇవ్వగా, కేవలం 14 మందికి మాత్రమే ఫుల్ స్కాలర్ షిప్ వచ్చింది. అందులో కూడా సింగర్స్ విభాగంలో పూర్తి స్కాలర్ షిప్ పొందిన ఏకైక విద్యార్థిని సుకృతి వేణి కావడం విశేషం!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments