ఎలన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. ఎ రైజ్ ఈస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎలన్ దర్శకత్వంలో శ్రీనిధి సాగర్ నిర్మించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఆగస్టు 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది!!

