HomeEntertainmentవిజయ్ కుమార్ కలివరపు పెద్ద సక్సెస్ కొట్టబోతున్నారు

విజయ్ కుమార్ కలివరపు పెద్ద సక్సెస్ కొట్టబోతున్నారు

- Advertisment -

-హీరో నిఖిల్ సిద్ధార్ద్

జయమ్మ పంచాయతీ’ ఫేమ్ విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో అర్విన్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బాల 369’. ‘అటజని కంచె’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. అర్విన్ ఆర్యశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ కలివరపు, ఎల్లయ్య నిర్మిస్తున్నారు. వైవా హర్ష సమర్పిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం నవంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు హీరో నిఖిల్ సిద్ధార్థ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హీరో నిఖిల్ సిద్ధార్థ మాట్లాడుతూ.. “స్వయంకృషితో ఎదిగిన నటుడు హర్ష. ఈ సినిమాతో ప్రజెంటర్ గా మారారు. తన జర్నీ చాలా ఫెంటాస్టిక్‌గా, ఇన్‌స్పిరేషనల్. ఆర్విన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. తనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నాను. డైరెక్టర్ విజయ్ గారు ఇంతకుముందు ‘జయమ్మ పంచాయతీ’ అనే అద్భుతమైన సినిమా తీశారు. ఈ రెండో సినిమాతో ఆయన పెద్ద కమర్షియల్ సక్సెస్ కొట్టబోతున్నారు” అని అన్నారు

డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. “అల్లసాని పెద్దన రచించిన ‘మనుచరిత్ర’లోని ‘అటజని కాంచే’ పద్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథను రాశాను. నా తెలుగు ఉపాధ్యాయులకు, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి తెలుగు ఉపాధ్యాయులకు అంకితం చేస్తున్నాను. ఈ సినిమాను చాలా దేశాల్లో షూట్ చేశాను. కాశ్మీర్‌లో షూట్ చేసినప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. షూటింగ్ కోసం కొన్ని నకిలీ తుపాకులు కావాలి. అవి అక్కడ దొరకలేదు. కృష్ణానగర్ నుంచి తీసుకెళ్తున్నప్పుడు ఎయిర్‌పోర్టులో పోలీసులు, ఆర్మీ అధికారులు నన్ను అడ్డగించి చుట్టుముట్టారు. దాదాపు గంటపాటు విచారించారు. నేను సినిమా దర్శకుడినని తెలిసిన తర్వాత విడిచిపెట్టారు. 15 దేశాల్లో ఈ సినిమాను షూట్ చేశాం. ఈ జర్నీని ఎంతో ఆస్వాదించాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా ప్యాషన్‌తో పనిచేశాను. ఎన్నో కొత్త అనుభవాలను పొందాను” అని అన్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments