మళ్ళీ మెగా గందరగోళం
సంక్రాంతి సీజన్‌లో రెండు వారాల వ్యవధిలో మెగాస్టార్ “కాకా”తో పాటు ‘విశ్వంభర’ కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయన్న ప్రచారం ఇప్పుడు మళ్లీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘కాకా’ ఇప్పటికే జనవరి 13, 2027న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించగా, ‘విశ్వంభర’ కూడా అదే తేదీని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే విశ్వంభర విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంక్రాంతి బరిలో ‘విశ్వంభర’కే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
వశిష్ఠ దర్శకత్వంలో భారీ సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్న ‘విశ్వంభర’కు గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులే ప్రధాన సవాలుగా నిలిచాయి. చిరంజీవి ఇమేజ్‌కు సంక్రాంతి సెంటిమెంట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఒకవేళ రెండు చిత్రాల మధ్య రెండు వారాల గ్యాప్‌తో విడుదల ఖరారైతే మెగా అభిమానులకు పండగ డబుల్ ధమాకానే! మరి ఈ విడుదల తేదీల గందరగోళానికి మెగాస్టార్ ఎప్పుడు తెరదించుతారో చూడాలి!
