సేవ్ స్మాల్ సినిమా
మెగా ఫ్రెండ్ షిప్ సైక్లథాన్
సెప్టెంబర్ 27, 2025, ఫిలిం చాంబర్ – కె.బి.ఆర్ పార్క్, హైదరాబాద్
చిన్న సినిమా నిర్మాతలు – సినిమా నిర్మాణం, పబ్లిసిటీ, విడుదల, సినిమాల వాణిజ్యం రంగాలలో ఎదుర్కొంటున్న సమస్యల నిర్మూలన మరియు ఆయా సమస్యలగూర్చి మరింత అవగాహన కోసం సినెటేరియా ఫౌండేషన్ మరియు హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ లు సమ్యుక్తంగా సేవ్ స్మాల్ (స్మాల్ బడ్జెట్) సినిమా – మెగా ఫ్రెండ్ షిప్ సైక్లథాన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 27, 2025న, ఫిలిం చాంబర్ నుంచి కె.బి.ఆర్ పార్క్ వరకు నిర్వహించనుంది.
సినిమా నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు, నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
ఈ సేవ్ స్మాల్ (స్మాల్ బడ్జెట్) సినిమా – మెగా ఫ్రెండ్ షిప్ సైక్లథాన్ లో పాల్గొనడం కోసం ఉచితంగా తమ పేర్లను నమోదుచేసుకోవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఎటువంటు ఫీజు లేదు. పాల్గొన్న వారికి టీ-షర్ట్, క్యాప్ మరియు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉచితంగా ఇవ్వబడును.
మరిన్ని వివరాలకోసం ఫోన్ నంబర్ 0 87122 17555 సంప్రదించవచ్చు.
కృతజ్ఞతలు
సినెటేరియా ఫౌండేషన్
ఫిలిం నగర్, హైదరాబాద్
