అభిమానికి సాయం చేసిన వెంకటేష్ హెల్పింగ్ స్
మాడుగుల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ నటుడు వెంకటేష్ అభిమాని జెమిని ఇటీవల ఘోర రోడ్ ప్రమాదానికి గురై వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.. వెంకటేశ్ డూప్ గా స్టేజ్ ప్రోగ్రామ్ లు ఇచ్చే జెమిని ఆర్ధిక పరిస్థితి చాలా దుర్లభం.. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్ర ప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం వ్యవస్థాపకుడు పి.చందు ఆధ్వర్యంలో టీమ్ సభ్యులు ద్వారా సేకరించిన 30000 రూపాయలు అమౌంట్ ను వైజాగ్ టీం ఇంచార్జి లు గిరిబాబు,అర్జున్ పచ్చిపాల తో కలిసి ఈ అమౌంట్ ను జెమిని కి తక్షణ సాయం గా అందజేశారు.. ఈ సందర్భంగా వెంకటేష్ హెల్పింగ్ హాండ్స్ చందు మాట్లాడుతూ.. మా హీరో వెంకటేష్ గారి ఆశయాలకు అనుగుణంగా అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజంలో ఒక భాగం కావాలి అనే పిలుపు మేరకు ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం ద్వారా ఇబ్బందుల్లో ఉన్న అభిమానులకు చేదోడుగా ఉంటూ ఈ కార్యక్రమాలు గత 5సంవత్సరాలుగా చేస్తున్నామని… సాయం కోరివచ్చిన ప్రతి అభిమానికి మా టీం అండగా ఉంటుందని అన్నారు..సకాలంలోనే బాధితుడికి సాయం అందించిన ప్రతి ఒక్క హెల్పింగ్ హాండ్స్ సభ్యుడికి ధన్యవాదాలు తెలియజేశారు.. బాధితుడు జెమిని కుటుంబ సభ్యులు కష్ట కాలంలో ఆదుకున్న వెంకటేష్ బాబు గారి అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు…

