మనందరి ఆత్మీయుడు, సోదరసమానులు
అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు… సికింద్రాబాద్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా…
వికలాంగుల సంస్థకు చర్మన్ గా మనందరివాడు
🙏పిన్నమనేని సాయిబాబు🙏
నిన్న తెల్లవారితే హైద్రాబాదులొ వారి నివాసమున అకస్మాతు మృతి చెందటం మన అన్నగారి వీరాభిమానులకు యావత్ మన తెలుగుదేశం పార్టీ వీరసైన్య కార్యకర్తలను బాధలో ముంచేసింది. అయన మృతి అటు అభిమానులకు ఇటు కార్యకర్తలకు తీరని లోటు…..
మన అన్న ఎన్.టి.ఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తెలుగు దేశం జెండాను మోసిన మొట్టమొదటి వీరసైన్య కార్యకర్తలలో కార్యకర్త మన సాయిబాబు. ఎన్ని కష్టాలు వచ్చిన ముందుండి నడిపించాడు సాయిబాబు…. ఒక అభిమానిగా కార్యకర్తగా ఎన్.టి.ఆర్ కు తెలుగుదేశం పార్టీ ఎన్నో సేవలందించారు. వారికీ ఘన నివాళి శ్రదాoజలీ అర్పిస్తూ…
వారి ఆత్మ శాంతి చేకూరాలని….
తెలుగుదేశం పార్టీ తరఫున, మా కుటుంభం తరఫున వారి కుటుంభ సభ్యులందరికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ…
పసుపు కార్యకర్త
ఆత్మీయులు
నందమూరి రామకృష్ణ

