మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మారెమ్మ’ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ఫస్ట్ సింగిల్ ‘బావ బావ’ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా మేకర్స్ మారి సాంగ్ ని లాంచ్ చేశారు.ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. మంగ్లీ వోకల్స్ మరో ఆకర్షణగా నిలిచింది.
మంచాల నాగరాజ్ మారెమ్మ నుంచి మరో సాంగ్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
