HomeEntertainmentఆధ్యాత్మిక పాత్రలో అజాతశత్రువు -

ఆధ్యాత్మిక పాత్రలో అజాతశత్రువు –

- Advertisment -


“వేదవ్యాస్ ” లో మురళీ మోహన్ గెట్ అప్ రిలీజ్
“ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో మా “సాయి ప్రగతి ఫిలిమ్స్ ” నిర్మిస్తున్న తొలి చిత్రం “వేద వ్యాస్ ” లో ఒక ప్రత్యేక పాత్ర పోషించిన ప్రఖ్యాత నటులు , నిర్మాత మురళీమోహన్ గారికి 86వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా చిత్రంలో ఆయన గెటప్ ను రివీల్ చేస్తున్నాము ” అన్నారు చిత్ర నిర్మాత, మాజీ శాసన సభ్యులు కొమ్మూరి ప్రతాపరెడ్డి. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ” మా చిత్రంలో హైందవ ధర్మ విశిష్టతను చాటే ప్రత్యేక ప్రభోధాత్మక పాత్రలో నటించిన మురళీమోహన్ గారు భారత ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మక “పద్మశ్రీ అవార్డు” ను స్వీకరిస్తున్న సందర్భం (జూన్ 23) లోనే ఆయన జన్మదినం (జూన్ 24) కూడా కలిసి రావడం యాదృచ్ఛిక విశేషం. ఈ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం నుండి ఆయన అందుకుంటున్న “బర్త్ డే గిఫ్ట్ ” గా భావిస్తూ ఈ రెండు ఆహ్లాదకర సందర్భాలను పురస్కరించుకొని మా సాయి ప్రగతి ఫిలిమ్స్ పక్షాన అజాతశత్రువు మురళీమోహన్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న మా “వేద వ్యాస్ ” చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం” అన్నారు కొమ్మూరి ప్రతాపరెడ్డి.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments