బ్లాక్‌బస్టర్ సక్సెస్ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. ‘అలియాస్ రుక్మిణి’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆఫీయా సయ్యద్ హీరోయిన్. దీప్తి గంటా నిర్మాణంలో రొమాన్స్, హ్యూమర్, ఆసక్తికరమైన కథనంతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.

