HomeEntertainmentత్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జంగా’ నుంచి మోషన్ పోస్టర్ విడుదల

త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జంగా’ నుంచి మోషన్ పోస్టర్ విడుదల

- Advertisment -

శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న చిత్రం ‘జంగా’. త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్,
నాగ మహేష్,భూపాల్,
రఘు కారుమంచి, రచ్చ రవి,
ప్రధాన పాత్రల్లో రాబోతోన్న ఈ మూవీకి కెవిన్ గడ్డం(శ్రీహరి) కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.
త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ స్పెషల్ అప్డేట్‌ను ఇచ్చారు.

త్రిగుణ్ బర్త్ డే స్పెషల్‌గా ‘జంగా’ నుంచి పోస్టర్ & మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులోని విజువల్స్, సౌండింగ్, హీరో లుక్ చాలా కొత్తగా ఉన్నాయి. ఇంత వరకు లవర్ బాయ్‌లా కనిపించిన త్రిగుణ్ ఈ సారి రా అండ్ రస్టిక్ లుక్‌లో మాసీగా కనిపిస్తున్నారు. కెరీర్‌లోనే డిఫరెంట్ సబ్జెక్ట్, పాత్రని పోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో ఆడియెన్స్‌ని ఆకట్టుకోనున్నారు.

ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తుండగా.. వెంకట్ సి. దిలీప్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్ మాటలు రాయగా.. కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి పాటల్ని రాస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.

నటీనటులు : త్రిగుణ్,
నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్,
నాగ మహేష్,భూపాల్ రాజు ,
రఘు కారుమంచి, రచ్చ రవి,

టెక్నికల్ టీం

బ్యానర్ : ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ
సమర్ఫణ :శ్రీమతి వనిత కిలారి
నిర్మాతలు :రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి
కథ, కథనం, దర్శకత్వం :కెవిన్ గడ్డం(శ్రీహరి)
కెమెరామెన్ :వెంకట్ సి. దిలీప్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
సంగీతం : కృష్ణ సౌరభ్
లిరిక్స్ : కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి
డైలాగ్స్ : ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్
ఆర్ట్ డైరెక్టర్ : రఘు కులకర్ణి
డాన్స్: కెవిన్ గడ్డం,
డా,, పేరిని రవితేజ
కాస్ట్యూమ్స్ : హర్ష, సంతోష్
ఫైట్స్ : వెంకట్ , కార్తిక్
కో డైరెక్టర్స్ : సూర్య,
మోడి రామజగన్నాథ్
ప్రొడక్షన్ మేనేజర్ : ఆంజనేయులు
పబ్లిసిటీ డిజైనర్స్ : అనిల్, భాను
పీఆర్వో :సాయి సతీష్

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments