HomeEntertainment“టైటిల్‌కు తగ్గట్టే కథలో ఊహించని మలుపులు ఉంటాయి”-‘కొత్త మలుపు’ మూవీ హీరో ఆకాష్ గోపరాజు

“టైటిల్‌కు తగ్గట్టే కథలో ఊహించని మలుపులు ఉంటాయి”-‘కొత్త మలుపు’ మూవీ హీరో ఆకాష్ గోపరాజు

- Advertisment -

▪️ ప్రముఖ సింగ‌ర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా 2వ సినిమా
▪️ జూన్ 12న థియేట‌ర్‌లలో ‘కొత్త మలుపు’ విడుద‌ల‌

ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన‌ రెండో చిత్రం ‘కొత్త మలుపు’. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోనసీమ నేపథ్యంలో రూపొందిన ఈ రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ఆకాష్ మీడియా ప్ర‌తినిధుల‌తో ముచ్చటించారు. సినిమా విశేషాలు, తన పాత్ర, సింగర్ సునీత సపోర్ట్, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రశ్న: మీ తొలి చిత్రం ‘సర్కారు నౌకరి’తో పోలిస్తే ‘కొత్త మలుపు’ ఎలా భిన్నంగా ఉంటుంది?

ఆకాష్: ‘సర్కారు నౌకరి’ ఒక పీరియడ్ డ్రామా అయితే, ‘కొత్త మలుపు’ పూర్తిగా భిన్నమైన జానర్‌లో రూపొందింది. ఇది కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే విలేజ్ రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్. లవ్, కామెడీ, ఎమోషన్స్‌తో పాటు కథను ముందుకు నడిపే ఆసక్తికరమైన సస్పెన్స్ కూడా ఉంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నాను. క‌థ‌కు త‌గిన‌ట్టే ప్రముఖ దర్శకులు ఏ కోదండరామిరెడ్డి గారు సినిమాకు ఈ టైటిల్ సూచించారు.

ప్రశ్న: సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

ఆకాష్: ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నేటి యువత ఆలోచనలు, వారి భావోద్వేగాలకు దగ్గరగా ఉండే పాత్ర ఇది. నటన పరంగా కూడా మొదటి సినిమాతో పోలిస్తే మరింత మెరుగ్గా కనిపించేందుకు ప్రయత్నించాను. బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. సీనియ‌ర్‌ల స‌ల‌హాల‌తో, మా అమ్మ సూచ‌న‌ల‌తో నా ఫ‌ర్మార్మెన్స్, యాక్టింగ్ స్కిల్స్ చాలా నేర్చుకున్నాను.

ప్రశ్న: ఈ కథలో మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్న అంశం ఏది?

ఆకాష్: దర్శకుడు శివ వరప్రసాద్ గారు కథ చెప్పినప్పుడు అందులోని ట్విస్టులు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నేను ఎలా అయితే స‌ర‌దాగా సాగిపోయే పాత్ర ఉండాలో అచ్చం అలాంటి పాత్ర‌తో కూడిన స‌బ్జెక్టును డైరెక్ట‌ర్ గారు నాకు చెప్ప‌గానే నాకు బాగా న‌చ్చింది. ఇక‌ టైటిల్‌కు తగ్గట్టే కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులు ఊహించలేరు. కోనసీమ అందాలను అందంగా చూపిస్తూ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కథను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు.

ప్రశ్న: మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మద్దతు లభించడం ఎంతవరకు ఉపయోగపడింది?

ఆకాష్: మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మా సినిమాకు చాలా పెద్ద బలం. ఇలాంటి దిగ్గ‌జ‌ సంస్థ మా సినిమాను విడుదల చేయడం వల్ల ప్రేక్షకుల్లో మరింత నమ్మకం పెరిగింది. కంటెంట్‌పై విశ్వాసంతోనే వారు ముందుకు వచ్చారు. దీని వల్ల సినిమా మరింత మందికి చేరుతుందని భావిస్తున్నాం.

ప్రశ్న: హీరోయిన్ భైరవి అర్ధ్యాతో మీ కెమిస్ట్రీ గురించి చెప్పండి?

ఆకాష్: సినిమాలో మేమిద్దరం బావ-మరదళ్లుగా కనిపిస్తాం. పల్లెటూరి నేపథ్యంలో సాగే మా పాత్రల మధ్య వచ్చే ప్రేమ, సరదా గొడవలు, ఫన్నీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. మా జోడీ తెరపై చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుందని దర్శకుడు కూడా చెప్పారు.

ప్రశ్న: సినిమా చూసిన తర్వాత మీ అమ్మ సునీత గారి స్పందన ఎలా ఉంది?

ఆకాష్: అమ్మ సినిమా చూసి చాలా సంతోషించింది. సినిమా అవుట్‌పుట్ చాలా బాగుందని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చెప్పింది. నా కెరీర్ విషయంలో కథల ఎంపికలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తుంది. అయితే ఎప్పుడూ నా వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఆమె మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు.

ప్రశ్న: సినిమా నిర్మాణ విలువలు, ప్రొడక్షన్ గురించి మీరు ఏమి చెబుతారు?

ఆకాష్: ఈ సినిమా విషయంలో నిర్మాత తాటి బాలకృష్ణ గారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. కథకు ఏది అవసరమో అది అందించాలనే దృక్పథంతో ముందుకు వెళ్లారు. కోనసీమలోని అందమైన లొకేషన్లను సహజత్వానికి దగ్గరగా, గ్రాండ్‌గా చూపించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చిన్న సినిమాగా కాకుండా, ప్రతి ఫ్రేమ్‌లో ఒక మంచి క్వాలిటీ కనిపించేలా ప్రొడక్షన్ విలువలను మెయింటైన్ చేశారు. నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ పూర్తి సహకారం అందిస్తూ సినిమా కోసం ఎంతో ప్యాషన్‌తో పనిచేశారు. ఆయన సపోర్ట్ వల్లే మేమంతా చాలా కంఫర్ట్‌గా పని చేయగలిగాం. ప్రేక్షకులు సినిమా చూస్తే ఆ క్వాలిటీ, నిర్మాణ విలువలు ఖచ్చితంగా కనిపిస్తాయి.

ప్రశ్న: చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి చెప్పండి?

ఆకాష్: రఘుబాబు గారు, పృథ్వీరాజ్ గారు, ప్రభావతి గారు వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. వారి అనుభవం మాకు చాలా ఉపయోగపడింది. నిర్మాత తాటి బాలకృష్ణ గారు ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. అలాగే సంగీత దర్శకుడు యశ్వంత్ నాగ్ అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

ప్రశ్న: జూన్ 12న విడుదల కానున్న ‘కొత్త మలుపు’ గురించి ప్రేక్షకులకు ఏమి చెప్పాలనుకుంటున్నారు?

ఆకాష్: ‘కొత్త మలుపు’ ఒక ప్యూర్ ఫ్యామిలీ, లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్. పల్లెటూరి అందాలు, ప్రేమ, నవ్వులు, ఎమోషన్స్, సస్పెన్స్ అన్నీ కలగలిపిన చిత్రం. మేమంతా ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన ఈ సినిమాను జూన్ 12న థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

తొలి చిత్రం ‘సర్కారు నౌకరి’తో హీరోగా పరిచయమైన ఆకాష్ గోపరాజు, ఇప్పుడు ‘కొత్త మలుపు’తో మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల వస్తున్న నేప‌థ్యంలో ఈ సినిమాపై తెలుగు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కోనసీమ నేపథ్యం, రొమాన్స్, సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై చిత్రబృందం పూర్తి నమ్మకంతో ఉంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments