HomeEntertainmentనా కెరీర్ లో మరో కలికితురాయి కర

నా కెరీర్ లో మరో కలికితురాయి కర

- Advertisment -

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. “ధనుష్ మాట్లాడుతూ .. ‘‘కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ. విఘ్నేశ్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. విఘ్నేశ్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి. ఇక ముందు మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తుంటాయి. ‘పోరు తొళిల్’ చూసిన తరువాత విఘ్నేశ్‌ ఎనర్జీ నన్ను టచ్ చేసినట్టు అనిపించింది. అందుకే ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది. ఈ మూవీకి సపోర్ట్ చేసిన గణేష్ గారికి థాంక్స్. మమిత గారు అద్భుతమైన నటి. రవి కుమార్ సార్‌తో పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. నా ఫ్రెండ్ జీవీ నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తుంటారు. ‘కుబేర’, ‘ఇడ్లీకొట్టు’ తరువాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను. ‘కర’ ఎంతో క్వాలిటీతో రాబోతోంది. మా కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి, వెంకీ అట్లూరి, బుచ్చిబాబు గారికి థాంక్స్. ఏప్రిల్ 30న మా సినిమా రాబోతోంది. థియేటర్లో మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments