-అలియాభట్
యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో రాబోతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆల్పా’. అలియా భట్, షర్వారిలతో “ఆల్ఫా” చిత్రం ఆటిట్యూడ్‌కు ఒక వేడుకగా, ప్రతీకగా నిలిచే ఓ యాక్షన్ ఎంటర్టైనర్గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ మూవీ షూటింగ్, అందులోని క్షణాల్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అలియా భట్ అన్నారు. ఆమె మాట్లాడుతూ..‘‘ఆల్ఫా’ చిత్రానికి పని చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. నేను ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. యాక్షన్, గ్రాండియర్, అడ్వెంచర్లతో కూడిన ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. ఇది నేను మునుపెన్నడూ అనుభవించని ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్. షూటింగ్‌లోని ప్రతీ క్షణాన్ని నేను ఎంతో ప్రేమించాను, ఆస్వాదించాను.

