న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ బాక్సాఫీస్ తాండవం ‘ది ప్యారడైజ్’. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మీడియా ములాఖాత్ నిర్వహించారు. ఇందులో మోహన్ బాబు, నాని, శ్రీకాంత్ ఓదెల, చెరుకూరి సుధాకర్, సంపూర్ణేష్ బాబు, మైత్రి డిస్ట్రిబ్యూషన్ శశి పాల్గొని, సినిమా సాధిస్తున్న విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు!!

