ఫహాద్ ఫాజిల్
ఫహాద్ ఫాజిల్ హీరోగా ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ఫహాద్ ఫాజిల్ మీడియాతో ముచ్చటించారు.
- కార్తికేయ నాకు ఫోన్ చేసి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ గురించి చెప్పారు. శశాంక్ వచ్చి కథ చెప్పారు. నా జీవితంలో అసలు ఇలాంటి కథను వినలేదు. ఈ సినిమాని ఎలా అయినా సరే చేయాలని ఫిక్స్ అయ్యాను.
- ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే చిత్రంలో ప్రేమ, ఆప్యాయత, అనుబంధం వంటి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మ్యాజిక్ అనే పార్ట్ ఒక అంశం మాత్రమే. ఈ సినిమాలో లోతైన అంశాలు, భావోద్వేగాలెన్నో ఉన్నాయి. చాలామందికి చాలా విషయాల్ని అర్థమయ్యేలా చెప్పే చిత్రం అవుతుంది.
- మలయాళంలో కథను అర్థం చేసుకుని, డైలాగ్స్ నేర్చుకుని.. ఇంగ్లీష్‌లోకి మార్చుకుని.. తెలుగులో నటించడం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. కాస్త కష్టంగానే అనిపించినా ఈ జర్నీ నాకు ఎంతో నచ్చింది.
- నాకు రియల్ లొకేషన్‌లో షూటింగ్ చేయడం అంటేనే ఇష్టం. కానీ ‘పుష్ప’ సినిమాకి మాత్రం అలా చేయడం కుదరలేదు. ఈ సినిమాని చాలా వరకు రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం.

