కేసీఆర్ బయోపిక్”అంటూ గతంలో పలుమార్లు ప్రకటనలు వెలువడ్డాయి. అయితే అవి కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ ఇప్పుడు సదరు “లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్” పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. “ప్యారడైజ్” చిత్రంలో ప్రియదర్శి నటించిన కేసీఆర్ పాత్ర నిడివి చాలా చిన్నదైనప్పటికీ అసాధారణ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియదర్శితో కేసీఆర్ సినిమా అతి త్వరలో సెట్స్ కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్వయంగా ఈ ప్రాజెక్ట్ పట్ల అమితాసక్తి కనబరుస్తున్నారని, అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం అందుతోంది. అయితే… ఈ చిత్రానికి దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్స్ ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్!!

