HomeEntertainmentప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘లవ్ వైరస్–2’ సాంగ్ ఆవిష్కరణ

ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘లవ్ వైరస్–2’ సాంగ్ ఆవిష్కరణ

- Advertisment -

హైదరాబాద్:

జర్నలిస్ట్ ఎస్.డి. నుమన్ దర్శకత్వంలో రూపొందిన ‘లవ్ వైరస్’ షార్ట్ ఫిలిం విడుదలైన కొద్ది కాలంలోనే విశేష ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం సోషల్ మీడియాలో మంచి స్పందనను సాధించడంతో, అదే ఉత్సాహంతో ‘లవ్ వైరస్–2’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది.

స్వయంకృషి క్రియేషన్స్ బ్యానర్‌పై జర్నలిస్ట్ ఎస్.డి. నుమన్ దర్శకత్వంలో, అరమాస ప్రవీణ్ నిర్మాతగా రూపొందుతున్న ‘లవ్ వైరస్–2’ షార్ట్ ఫిలిం సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆదివారం రాయదుర్గంలోని తన నివాసంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వి.వి. వినాయక్ మాట్లాడుతూ, కేవలం 36 గంటల్లో 40 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం రూపొందించడం నిజంగా అభినందనీయమని అన్నారు. ‘లవ్ వైరస్’ తొలి భాగానికి సోషల్ మీడియాలో లభించిన విశేష ఆదరణే రెండో భాగం నిర్మాణానికి ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ ముందుకు వస్తున్న నిర్మాత అరమాస ప్రవీణ్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

దర్శకుడు ఎస్.డి. నుమన్ మాట్లాడుతూ, మొదటి భాగానికి ప్రేక్షకులు అందించిన ఆదరణతో మరింత బాధ్యతగా ‘లవ్ వైరస్–2’ ను రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు భాను ప్రకాష్, గణపతి, శ్యామ్, డి.ఓ.పీ. హరీష్, శ్రీహర్ష, గ్రాఫిక్ డిజైనర్ ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ‘లవ్ వైరస్–2’ కూడా తొలి భాగం మాదిరిగానే ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేసింది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments