మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా, సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో.. “పిండం” అనంతరం కలాహీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘LEGACY’. యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ సహ నిర్మాత. ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తుండగా, మురళీ మోహన్ , కె కె మీనన్ , రావు రమేష్, సచిన్ ఖేడేకర్, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, కలెక్టర్ శ్రీనివాస్, రవి కాలే, అమిత్ తివారీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా జరుపుకుంటోంది.

