అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ‘రంభ ఊర్వశి మేనక’తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.

