HomeEntertainmentనాయకులు కోకొల్లలు ప్రతినాయకులు లేరెవ్వరు

నాయకులు కోకొల్లలు ప్రతినాయకులు లేరెవ్వరు

- Advertisment -

హీరోలు పెరుగుతున్నారు… కానీ హీరోలను ఢీకొట్టే విలన్లు ఎక్కడ? హీరో ఎంత ముఖ్యమో… విలన్ కూడా అంతే ముఖ్యుడు. ఎందుకంటే హీరో పరాక్రమాన్ని నిరూపించేది… విలనే.
కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
పాన్ ఇండియా సినిమాలు పెరిగాయి… బడ్జెట్లు పెరిగాయి… హీరోల మార్కెట్ విస్తరించింది. కానీ అదే స్థాయిలో ప్రేక్షకులను భయపెట్టే విలన్లు మాత్రం తగ్గిపోయారు. పాత తరంలో ఎస్.వి.రంగారావు… తర్వాత
రావు గోపాలరావు…. కోట శ్రీనివాసరావు హీరోలను డీ కొట్టేవారు. ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, ముఖేష్ రిషి, దేవ్ గిల్, సోనూ సూద్ వంటివారు హీరోలకు గట్టి సవాల్ విసిరేవారు.
ఇటీవలి కాలంలో చాలా సినిమాలు పూర్తిగా హీరో ఎలివేషన్ చుట్టూనే తిరుగుతున్నాయి. విలన్ పాత్రను బలంగా రాస్తే హీరో ఇమేజ్ తగ్గిపోతుందనే అపోహ ఇంకా కొంతమందిలో కనిపిస్తోంది. కానీ వాస్తవానికి… బలమైన విలనే హీరోని మరింత ఎత్తుకు తీసుకెళ్తాడు.
మరోవైపు, చాలామంది విలన్లకు స్పష్టమైన లక్ష్యం, బలమైన నేపథ్యం, గుర్తుండిపోయే వ్యక్తిత్వం ఉండటం లేదు. అందుకే వారు కథలో కేవలం అడ్డంకిలా కనిపిస్తున్నారు.
‘ఛత్రపతి’, ‘పోకిరి’, ‘విక్రమార్కుడు’ చిత్రాల్లో విలన్లు హీరోలకు ధీటుగా ఉంటారీ. ఆ పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోవడానికి కారణం అదే. వారు కేవలం ప్రతినాయకులు కాదు… హీరో ప్రయాణాన్ని మరింత గొప్పగా మార్చిన పాత్రలు.
ప్రేక్షకుడు హీరో విజయాన్ని ఆస్వాదించాలంటే… ముందుగా విలన్ శక్తిని నమ్మాలి.
ఈరోజు టాలీవుడ్‌కు అవసరం మరో స్టార్ హీరో కాదు…
హీరోలను ఢీకొట్టే కొత్త తరం విలన్లు.
ఎందుకంటే…
హీరోని అభిమానులు తయారు చేస్తారు… గొప్ప హీరోని మాత్రం ఒక గొప్ప విలనే తయారు చేస్తాడు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments