మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తవ్వగా, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో చిత్రబృందం బిజీగా ఉంది.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా కన్నడ భామ రుక్మిణి వసంత్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్.. తమ తదుపరి చిత్రం కోసం కూడా “రుక్మిణి”ని గట్టిగా సిఫార్సు చేస్తున్నారని, సుకుమార్ కూడా అందుకు సానుకూలంగా ఉన్నారని సమాచారం!!

