HomeEntertainmentదేవిశ్రీప్రసాద్ "ఎల్లమ్మ" పాలిట నరరూప రాక్షసుడిగా వడ్డే నవీన్?

దేవిశ్రీప్రసాద్ “ఎల్లమ్మ” పాలిట నరరూప రాక్షసుడిగా వడ్డే నవీన్?

- Advertisment -

దేవిశ్రీప్రసాద్ టైటిల్ పాత్ర పోషిస్తున్న “ఎల్లమ్మ” చిత్రంతో వడ్డే నవీన్ విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడైన వడ్డే నవీన్… “కోరుకున్న ప్రియుడు, పెళ్ళి, మనసిచ్చి చూడు” వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాడు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం… బలగం వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న “ఎల్లమ్మ” చిత్రంలో ప్రతినాయకుడిగా నటించేందుకు వడ్డే నవీన్ పచ్చ జెండా ఊపారు.

సక్సెస్ ల పరంగా ఇటీవలకాలంలో కొంచెం వెనుకబడిన దిల్ రాజు… చిత్ర నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. “ఎల్లమ్మ” తోపాటు… విజయ్ దేవరకొండతో “రౌడీ జనార్దన్” నిర్మిస్తున్న దిల్ రాజు… బాలయ్యతో ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే… పరశురామ్ దర్శకత్వంలో తమిళ్ హీరో సూర్యతోనూ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments