HomeEntertainmentరాజమౌళి వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్ 290 కోట్లు

రాజమౌళి వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్ 290 కోట్లు

- Advertisment -

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సుమారు రూ.290 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.225 కోట్ల స్థాయిలో జరిగింది. ఇప్పుడు ఆ రికార్డును ‘వారణాసి’ అధిగమించబోతోందన్న ప్రచారం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

నిజానికి ఈ క్రేజ్‌కు కొన్ని బలమైన కారణాలున్నాయి. మహేష్ బాబు స్టార్‌డమ్ ఒకవైపు, రాజమౌళి బ్రాండ్ మరోవైపు. అందులోనూ ‘బాహుబలి’, ‘RRR’ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఈసారి మహేష్ బాబుతో గ్లోబల్ అడ్వెంచర్‌ను రూపొందిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నటీనటుల భాగస్వామ్యం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది!

రూ.290 కోట్లకు హక్కులు అమ్ముడవడం ఒక రికార్డు కావచ్చు. కానీ ఆ పెట్టుబడిని వెనక్కి తీసుకురావడం పంపిణీదారులకు అంతకంటే పెద్ద సవాలు. ఎందుకంటే థియేట్రికల్ వసూళ్లలో వచ్చిన మొత్తం పంపిణీదారుడి ఆదాయం కాదు. ఎగ్జిబిటర్ వాటా, ఇతర ఖర్చులు పోను వచ్చే షేర్ ఆధారంగానే లాభనష్టాలు నిర్ణయమవుతాయి. అందుకే ఇంత భారీ ధరకు హక్కులు తీసుకున్నప్పుడు ‘వారణాసి’ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ప్రభంజనం సృష్టించాల్సి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments