సినిమా అనేది కేవలం కథ కాదు.. అది ఒక అనుభూతి. ఆ అనుభూతిని ప్రేక్షకుల హృదయాల్లోకి తీసుకెళ్లేది కెమెరా. అలాంటి కెమెరా భాషను మాయాజాలంగా మార్చగల అరుదైన సినిమాటోగ్రాఫర్ పవన్ చెన్నా. మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ ద్వారా ఆయన తన ప్రతిభను మరో స్థాయికి తీసుకెళ్లారు. త్రికాల’ను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దిన పవన్ చెన్నా గురించిన టాపిక్ ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెండింగ్‌గా మారింది.
శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో, సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. మణి తెల్లగూటి దర్శకత్వంలో, రాధిక–శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్ ఎల్ఎల్‌పీ ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే… ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట తప్పనిసరిగా వినిపిస్తుంది..
“సినిమాటోగ్రఫీ ఈ సినిమాను విజువల్ వండర్‌గా మార్చింది!”

ఫ్రేమ్ ఫ్రేమ్‌లోనూ దైవత్వం… సస్పెన్స్!
సమకాలీన తెలుగు సినిమాలో సరికొత్త విజువల్ ట్రెండ్స్ సెట్ చేస్తున్న అద్భుతమైన సినిమాటోగ్రాఫర్లలో పవన్ చెన్నా ఒకరు. కేవలం నటీనటులను చూపించడమే కాకుండా, ప్రతి ఫ్రేమ్‌నూ ఒక కాన్వాస్‌లా మలచి లోతైన భావోద్వేగాలను పలికించడం ఆయన శైలి. మైథాలజీని ఒక మహా కావ్యంలా స్క్రీన్ పై ఆవిష్కరించారు. లార్జ్-ద్యాన్-లైఫ్ కంపోజిషన్స్, పక్కా ఫ్రేమింగ్, ఇన్-డెప్త్ విజువల్స్ ఆడియన్స్‌ను కట్టిపడేసాయి. లైటింగ్, షాడోలతో స్క్రీన్ పై అద్భుతమైన డ్రామా క్రియేట్ చేశారు. హై-కాంట్రాస్ట్ డ్రామా లైటింగ్ సెటప్స్ సినిమాలోని సూపర్ నేచురల్ టెన్షన్‌ను, హాంటింగ్ అట్మాస్పియర్‌ను పీక్స్‌కి తీసుకెళ్లాయి.
కలర్ థియరీ మ్యాజిక్
‘సృష్టిని మింగేసే చీకటి’కి, ‘రక్షించే దైవిక కాంతి’కి మధ్య పోరాటాన్ని చూపించడానికి డార్క్ ఇన్స్-బ్లాక్ టోన్స్, గోల్డెన్ లైట్ బీమ్స్ కలయికతో సృష్టించిన విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో అలరించాయి. ఇంటెన్స్ కెమెరా యాంగిల్స్, మూవ్‌మెంట్స్, క్లోజప్ షాట్స్, అద్భుతమైన డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌తో సస్పెన్స్‌ను చివరి వరకు నిలబెట్టారు.
పవన్ చెన్నా ఆలోచనా విధానం ‘స్టోరీ-ఫస్ట్’ (కథే ప్రాధానం). లైటింగ్, కాంపోజిషన్, లెంసెస్ లేదా కెమెరా మూవ్‌మెంట్ ఏదైనా సరే… కథలోని మూడ్‌ను, క్యారెక్టర్స్ ఎమోషన్స్‌ను పండించడానికే వాడతారు తప్ప డిస్ట్రాక్ట్ చేయడానికి కాదు. వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ వీడియోలు, ఫ్యాషన్ ఫిలిమ్స్ నుండి నేడు ‘త్రికాల’ వంటి పౌరాణిక థ్రిల్లర్ల వరకు ఆయన ప్రయాణంలో సాధించిన పరిణితి ఈ చిత్రంలో స్పష్టంగా కనిపించింది.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్… టాలీవుడ్‌లో కొత్త బెంచ్‌మార్క్!
సినిమాలో ఉపయోగించిన హైఎండ్ VFX గ్రాఫిక్స్‌కి పవన్ చెన్నా కెమెరా వర్క్ తోడై సినిమాకి కొండంత గ్రాండియర్, రిచ్‌నెస్‌ను తెచ్చిపెట్టింది. మూడీ కలర్ టోన్స్, విజువల్ టెక్స్చర్, క్రిస్ప్ లైటింగ్ కంట్రోల్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉండి, టాలీవుడ్ టెక్నికల్ స్టాండర్డ్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి.
ప్రాచీన సనాతన ధర్మం, దైవిక శక్తులు, చీకటి శక్తుల మధ్య జరిగే పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ, దైవత్వాన్ని, మిస్టరీని విజువల్ పోయెట్రీగా మలచడంలో పవన్ చెన్నా వందకి వంద శాతం విజయం సాధించారు.
‘త్రికాల’ను విజువల్ వండర్‌గా ట్రెండింగ్‌లో నిలిచిన సందర్భంగా ఈ చిత్ర డీవోపీ డీవోపీ పవన్ చెన్నా మాట్లాడుతూ… “ప్రతి ఫ్రేమ్ ఒక కథ చెప్పాలి… ప్రతి విజువల్ ప్రేక్షకుల్లో ఒక భావోద్వేగాన్ని కలిగించాలి అనే నమ్మకంతోనే నేను సినిమాటోగ్రఫీ చేస్తాను. నా దృష్టిలో కెమెరా అనేది కేవలం చిత్రాలను బంధించే సాధనం కాదు… దర్శకుడు ఊహించిన ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే భాష. ‘త్రికాల’ వంటి మైథలాజికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో సనాతన ధర్మం, దైవత్వం, మిస్టరీని విజువల్‌గా ఆవిష్కరించడం నాకు ఒక పెద్ద సవాల్‌గా అనిపించింది. ప్రతి సన్నివేశంలో లైటింగ్, కంపోజిషన్, కెమెరా మూవ్‌మెంట్, కలర్ టోన్ కథలోని భావోద్వేగాలకు అనుగుణంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. దర్శకుడు మణి తెల్లగూటి గారి విజన్‌ను తెరపై అత్యుత్తమంగా ఆవిష్కరించేందుకు మా టీమ్ అంతా ఎంతో అంకితభావంతో పనిచేశాం. ప్రేక్షకులు ఈ సినిమా విజువల్స్‌ను ఆదరిస్తూ, నా పనిని ప్రశంసించడం ఒక సినిమాటోగ్రాఫర్‌గా నాకు ఎంతో సంతోషాన్ని, మరింత బాధ్యతను ఇచ్చింది.” అని అన్నారు.
నిజమైన విజువల్ స్టోరీటెల్లింగ్ కేవలం మాటల్లో కాదు, ఫ్రేమ్ వెనుక ఉండే లోతైన భావనలలో ఉంటుందని నిరూపించిన అరుదైన టెక్నీషియన్ పవన్ చెన్నా. ‘త్రికాల – స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ చిత్రంతో తన నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిన ఆయన, రాబోయే రోజుల్లో భారతీయ సినిమాలో మరిన్ని మైలురాళ్ళు అందుకోవడమే కాకుండా తన కెమెరా లెన్స్ ద్వారా మరిన్ని విజువల్ అద్భుతాలను ఆవిష్కరించడం ఖాయంగా కనిపిస్తోంది.

