HomeEntertainmentప్రేక్షకులను ఆశీర్వదించేందుకు సీతారాములు వచ్చేస్తున్నారు

ప్రేక్షకులను ఆశీర్వదించేందుకు సీతారాములు వచ్చేస్తున్నారు

- Advertisment -

నితీష్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ నుంచి మరో అందమైన సంగీత కానుక ‘రంగులు రంగులే’ పాట విడుదలైంది. శ్రీరాముడు, సీతమ్మ ప్రేమకథను అద్భుతమైన విజువల్స్‌తో ఆవిష్కరిస్తూ, వారి ప్రయాణంలోని మధురమైన క్షణాలను ఈ పాటలో చూపించారు. తెలుగులో రాఘవ్ కౌశిక్, వైశాలి సామంత్ తమ గాత్రాన్ని అందించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు. రాకేందు మౌళి తెలుగు సాహిత్యాన్ని అందించారు. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మగా సాయిపల్లవి నటిస్తున్న ఈ పాట ప్రస్తుతం వరల్డ్ ఆఫ్ రామాయణ, టీ-సిరీస్ యూట్యూబ్ ఛానళ్లలో అందుబాటులో ఉంది. అన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలోనూ విడుదలైంది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి ఈ పాటను విడుదల చేశారు. నవంబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments