మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు తెరకెక్కించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఆదివారం నాడు ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్‌ను ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ భరత్ రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంఛ్ ఈవెంట్లో..
మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ .. ‘‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ అద్భుతంగా ఉంది. మా కర్నూలు నుంచి వచ్చిన హరి గారు తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. మా రెడ్ బుక్ గురించి ఇండియా వ్యాప్తంగా తెలుసు. అలానే ఈ ‘ది రెడ్ బ్యాగ్’ మూవీ కూడా ఇండియా అంతా సౌండ్ చేయాలి. కర్నూలులోనే అత్యధిక భాగంగా షూటింగ్ చేశారు. కానీ ఫారిన్లో తీసినట్టుగా కనిపిస్తోంది. సినిమా టీంకి ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం మంచి విజయం సాధించి మా హరికి డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రముఖ దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ లాంచ్‌కు వచ్చిన టీజీ భరత్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి వినూత్న చిత్రాలు తప్పకుండా విజయవంతం అవ్వాలి. హరి గారు ఈ చిత్రం హిట్ అయితే మరిన్ని కొత్త సినిమాల్ని నిర్మిస్తారు. ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ చూసి నేను షాక్ అయ్యాను. నెక్ట్స్ లెవెల్లో సినిమా ఉండబోతోందని అర్థమైంది. ఈ చిత్రం కచ్చితంగా విజయం అవుతుందనే నమ్మకం ఏర్పడింది. ఇదొక ట్రెండ్ సెట్టర్‌గా నిలవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దర్శకుడు రవి కుమార్ సీరపు మాట్లాడుతూ .. ‘‘ది రైడ్ బ్యాగ్’ చిత్రం లైఫ్ టైం ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ మూవీ చూసిన తరువాత మీరు ఎక్కడ రెడ్ బ్యాగ్‌ని చూసినా మా ‘ది రెడ్ బ్యాగ్’ సినిమా గుర్తుకు వస్తుంది. నా పదహారేళ్ల నిరీక్షణ తరువాత ఈ అవకాశం వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరి గారికి థాంక్స్. మాకోసం ఇక్కడకు వచ్చిన భరత్ గారికి, మాకు సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్స్. కథ విన్న వెంటనే హరి గారు ఓకే చెప్పేశారు. మా సినిమాకి కథే హీరో. కర్నూలులో చాలా వరకు రెక్కీ చేశాం. దాదాపు షూటింగ్ అంతా అక్కడే చేశాం. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ హిట్ చేస్తారు. ప్రేక్షకులు పెట్టే డబ్బులకు న్యాయం చేసేలా మా ‘ది రెడ్ బ్యాగ్’ సినిమా ఉంటుంది.’ అని అన్నారు.
నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి మాట్లాడుతూ .. ‘‘ది రెడ్ బ్యాగ్’ సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మూవీ చాలా బాగా వచ్చింది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. త్వరలోనే మూవీ రిలీజ్ కాబోతోంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
రాధ్య మాట్లాడుతూ .. ‘‘ది రెడ్ బ్యాగ్’ సినిమా విషయంలో హరి గారు, రవి గారు నాకు ఎంతో సపోర్ట్ చేసారు. మేం అందరం కలిసి ఎంతో కష్టపడి చిత్రాన్ని ఫినిష్ చేశాం. మా టీజర్ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాం. త్వరలోనే మా సినిమా రాబోతోంది. అందరూ మా మూవీని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఆకాంక్ష మాట్లాడుతూ .. ‘‘ది రెడ్ బ్యాగ్’ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన హరి గారికి, రవి గారికి థాంక్స్. టీం అంతా కలిసి ఎంతో కష్టపడి సినిమాని చేశాం. అందరి సమిష్టి కృషి వల్లే ఈ స్థాయిలో మూవీ వచ్చింది. మా టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. త్వరలోనే మా సినిమా రానుంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
మోనిక మాట్లాడుతూ .. ‘హరి గారు, రవి గారు లేకపోతే ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రం ఇంత బాగా వచ్చేది కాదు. మాకు ఈ అవకాశం ఇచ్చిన వారిద్దరికీ థాంక్స్. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే మా మూవీ రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
డైరెక్టర్ అహిషోర్ మాట్లాడుతూ .. ‘హరి నాకు మంచి స్నేహితుడు. ‘ది రెడ్ బ్యాగ్’ సినిమా సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశాడు. టీజర్ బాగుంది. చిత్రయూనిట్‌కి ఆల్ ది బెస్ట్. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటుడు ప్రసాద్ బెహరా మాట్లాడుతూ .. ‘‘ది రెడ్ బ్యాగ్’ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఇందులో నాది, కబీర్ సింగ్ ట్రాక్ బాగుంటుంది. ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు.. ఎన్నో భావోద్వేగాలతో సినిమా నిండి ఉంటుంది. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
లిరిక్ రైటర్ తిరుపతి మాట్లాడుతూ .. ‘‘ది రెడ్ బ్యాగ్’ చిత్రంలో నేను రెండు పాటలు రాశాను. టీజర్ బాగుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరి గారికి, రవి గారికి థాంక్స్. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
రైటర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘ది రెడ్ బ్యాగ్’ సినిమాలో మంచి కథ ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హరి గారికి థాంక్స్. ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటీనటులు : కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : మెమరీ మేకర్స్
నిర్మాత : హరికృష్ణ సోమిశెట్టి
దర్శకుడు : రవికుమార్ సీరపు
మ్యూజిక్ : శేఖర్ మోపురి
డీఓపీ : ప్రియేష్ గురుస్వామి
ఎడిటింగ్ : శివ శర్వాణి
పీఆర్వో : సాయి సతీష్

