HomeEntertainmentతెలుగు సినిమాకి పూర్వవైభవం

తెలుగు సినిమాకి పూర్వవైభవం

- Advertisment -

వరుస విజయాలతో మళ్లీ ఊపందుకున్న టాలీవుడ్

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే… కథకు ప్రాధాన్యం, కుటుంబ ప్రేక్షకుడి ఆదరణ, థియేటర్లలో సందడి, ప్రతి వారం కొత్త సినిమా కోసం ఎదురుచూపులు. కానీ కాలక్రమంలో పరిస్థితులు మారాయి. భారీ బడ్జెట్లు, పాన్‌ ఇండియా ఆలోచనలు, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు, ఓటీటీ ప్రభావం… ఇవన్నీ కలసి తెలుగు సినిమా ప్రయాణాన్ని కొత్త దిశల్లోకి తీసుకెళ్లాయి.


అయితే ఇప్పుడు మళ్లీ ఒక ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. ‘పెద్ది’ మొదలుకుని ‘విశ్వనాధం అండ్ సన్స్’ వరకు… వరుసగా వరిస్తున్న విజయాలు, ప్రేక్షకుల్లో కనిపిస్తున్న ఉత్సాహం తెలుగు సినిమాకు మరోసారి సానుకూల సంకేతాలను ఇస్తోంది.‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’, ‘డీసీ’, ‘కొరియన్ కనకరాజు’ వంటి విభిన్న నేపథ్యాల చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. పెద్ద హీరోలు, భారీ నిర్మాణాలకే పరిమితం కాకుండా… కొత్త కథలు, కొత్త కాంబినేషన్లు, కొత్త ఆలోచనలకు కూడా మార్కెట్ ఉందనే నమ్మకం పెరుగుతోంది.ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన మార్పు ఉంది.


అందుకే ఈ దశను కేవలం ‘హిట్ల సీజన్’గా చూడటం సరిపోదు. తెలుగు సినిమా మళ్లీ తన బలాన్ని గుర్తించుకుంటున్న దశగా చూడాలి. ఎందుకంటే పరిశ్రమకు నిజమైన పూర్వవైభవం రావాలంటే ఒకటి రెండు భారీ విజయాలు సరిపోవు. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ప్రతి స్థాయిలో మంచి కంటెంట్ రావాలి. ప్రేక్షకుడికి ఎంపికలు పెరగాలి. నిర్మాతకు ధైర్యం రావాలి. కొత్త దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు లభించాలి.
విజయం ఒక్క సినిమాకు వస్తుంది…పూర్వవైభవం మొత్తం పరిశ్రమకు వస్తుంది.ప్రస్తుతం తెలుగు సినిమా ప్రయాణాన్ని చూస్తుంటే ఆ దిశగా అడుగులు పడుతున్నట్టే అనిపిస్తోంది!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments