సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా తాజాగా ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కుకింగ్ ఫార్మాట్‌ను తమిళ ప్రేక్షకుల కోసం సోనీ విజా, సోనీ లివ్‌లో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హోస్ట్ చేస్తుండటం విశేషం. సెలబ్రిటీలు, ఫుడ్, కాంపిటీషన్.. ఈ మూడు ప్రపంచాలను ఒకే దగ్గరకి తీసుకొస్తూ ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ రూపొందుతోంది. తమిళ ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తొలిసారి సెట్స్ నుంచి కిచెన్‌లోకి అడుగుపెట్టి.. కఠినమైన వంటలకు సంబంధించిన సవాళ్లు, ఊహించని ట్విస్టులు, ఒత్తిడిని ఎదుర్కోబోతున్నారు. ప్రేక్షకులను మెప్పించడంతో పాటు.. ప్రతి ఛాలెంజ్‌లో విజయం సాధించేలా రుచికరమైన వంటకాలను తయారు చేస్తూ తమ టాలెంట్‌ను నిరూపించుకోబోతున్నారు.
బనిజె ఏషియా నిర్మిస్తోన్న ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మాస్టర్‌చెఫ్ ఫార్మాట్‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతోంది. అయితే తమిళ నేటివిటీకి తగ్గట్టుగా లోకల్ ఫ్లేవర్స్, ప్రేక్షకులకు సుపరిచితమైన సెలబ్రిటీలు, తమిళ సెలబ్రిటీ కల్చర్‌లోని ప్రత్యేకమైన కెమిస్ట్రీకి ప్రాధాన్యతనిస్తూ ఈ షోను రూపొందిస్తున్నారు!!

