HomeEntertainmentమధురమైన గాత్రంతో హలో అంటూ కట్టిపడేస్తున్న అమ్మాయి ఎవరు?

మధురమైన గాత్రంతో హలో అంటూ కట్టిపడేస్తున్న అమ్మాయి ఎవరు?

- Advertisment -

అమిత్, దివి జంటగా నటించిన అందమైన రొమాంటిక్ మ్యూజిక్ వీడియో “హలో అమ్మాయి” సంగీత అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటను ‘అనుగు ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నిర్మాత లక్ష్మణ్ రెడ్డి అనుగు ఎంతో నిర్మించారు. ఈ పాటను ఒకేసారి అమెరికా, ఇండియాలో అత్యంత ఘనంగా విడుదల చేశారు. అమెరికాలోని ఛార్లెట్ టి.టి.ఎ వేదికగా ప్రముఖ నిర్మాత డా. పైళ్ల మల్లారెడ్డి & దిల్ రాజు ఈ పాటను విడుదల చేయగా, ఇండియాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

‘మధుర ఆడియో ఒరిజినల్స్’ ద్వారా యూట్యూబ్‌లో ఈ పాట విడుదలై విశేష స్పందన తెచ్చుకుంటోంది.
ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ అద్భుతమైన కాన్సెప్ట్ అందించడంతోపాటు, దర్శకత్వం, నృత్య రీతులను నిర్వహించారు. అరుణ్ చిలువేరు అందించిన సంగీతానికి, సురేష్ బనిశెట్టి అందించిన సాహిత్యం, దీపు గాత్రం తోడవడంతో ఈ పాట శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. కెమెరామెన్ పృథ్వి అందించిన అద్భుతమైన విజువల్స్, అందమైన లొకేషన్లలో అమిత్, దివిల కెమిస్ట్రీ ఈ వీడియోకి హైలైట్‌గా నిలిచాయి. దివ్యారావు ఈ వీడియోకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించి నటీనటులకు స్టైలిష్ లుక్ అందించారు.

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments