- 10 మిలియన్ వ్యూస్ దిశగా
బహుముఖ ప్రతిభాసాలి సుధాకర్ బుర్రి రచన – దర్శకత్వంలో రూపొందిన “పేగుబంధం’ లఘు చిత్రానికి సోషల్ మీడియా బ్రహ్మరథం పడుతోంది. అప్లోడ్ చేసిన 24 గంటల వ్యవధిలోనే మూడున్నర మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. లక్షలాది లైక్స్, వేలాది షేర్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ హార్ట్ టచ్చింగ్ లఘు చిత్రంలో రాజమండ్రికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రభాకర్ లావేటి, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ధీరజ అప్పాజీతో పాటు ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ “తిరు” (Thiru Natural) నటించారు. అన్నదమ్ముల “పేగుబంధా”నికి దృశ్యరూపం ఇస్తూ సుధాకర్ బుర్రి రచన – దర్శకత్వంలో రూపొందిన ఈ లఘు చిత్రం ఇదే దూకుడు కొనసాగిస్తే 10 మిలియన్ న్యూస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది!!

