-మినిస్టర్ పొన్నం ప్రభాకర్
బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు “సర్దార్ సర్వాయి పాపన్న” జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ “సర్దార్ సర్వాయి పాపన్న”. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ. ఈ యానిమేషన్ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నిన్న తెలంగాణ ట్రాన్స్ పోర్ట్, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పోస్టర్ లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – “బహుజనుల రాజ్యం నెలకొల్పాలి, మన రాజ్యం మనమే పరిపాలించుకోవాలని పోరాటం సాగించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఒక్కో కోటను జయిస్తూ గోల్కొండ కోట దాకా వెళ్లిన ఆయన పోరాటం ఈ తరానికి స్ఫూర్తి. అలాంటి ధీరుడి చరిత్రతో వెంకటేష్ గౌడ్ సినిమా రూపొందించడం, ఆ సినిమాను రామకృష్ణ గౌడ్ గారు రిలీజ్ చేస్తుండటం సంతోషకరం” అని అన్నారు!!

