HomeEntertainmentకొలువుదీరిన కొత్త కార్యవర్గం

కొలువుదీరిన కొత్త కార్యవర్గం

- Advertisment -

తెలుగు ఫిలిం & టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) 2025–2027 సంవత్సరానికి సంబంధించి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకులు, డ్యాన్సర్లు, డ్యాన్స్ డైరెక్టర్లు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా తమ బాధ్యతలను స్వీకరించి ప్రమాణం చేశారు.

నూతన కార్యవర్గం
ప్రధాన కార్యదర్శి: జి. బాలకృష్ణ
కోశాధికారి: ఇశ్రాయేలు పిట్ట (వడివేల్)
ఉపాధ్యక్షులు: జి. శంకర్
జాయింట్ సెక్రటరీ: పి. నాగమల్లేశ్వరరావు
ఆర్గనైజింగ్ సెక్రటరీ: జి. రవితేజ
కార్యవర్గ సభ్యులు: పి. కన్నయ్య, జి. వెంకన్న, ఎం. రమేష్, ఎం. రాములు, కె. నిరంజని, సిహెచ్. సాయిలక్ష్మి తదితరులు.


కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీపుల్స్ మీడియా అధినేత, నిర్మాత విశ్వ ప్రసాద్, నటుడు తాగుబోతు రమేష్ హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments