ప్రముఖ నటుడు జగపతిబాబు నిర్వహిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” కొత్త సీజన్ సాయి పల్లవితో ప్రారంభం కానుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రామాయణ’ చిత్రంలో సీతగా సాయి పల్లవి ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో నిరాడంబరంగా ఉండే ఆమె, మనసులోని మాటలను ఉన్నది ఉన్నట్టుగా పంచుకునే విధానం సాయి పల్లవిని సమకాలీన భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఈ ఎపిసోడ్ ఈనెల 16 నుంచి జీ5లో, 18 నుంచి జీ-తెలుగులో ప్రసారం కానుంది!!

