సహజ నటనకు చిరునామాగా నిలిచిన సాయి పల్లవి… ప్రతి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పాత్ర ‘రామాయణం’లో సీత. ఈ పాత్ర కేవలం మరో సినిమా పాత్ర కాదు… ఓ నటిగా ఆమె ప్రతిభకు, వ్యక్తిత్వానికి దక్కిన అరుదైన గౌరవం.
ఇప్పటికే సాయి పల్లవి చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ధనుష్‌తో ‘D55’, మణిరత్నం-విజయ్ సేతుపతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం, అలాగే ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ వంటి విభిన్న కథలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే, సీత పాత్ర విజయం సాధిస్తే సాయి పల్లవి కెరీర్ మరో స్థాయికి చేరడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయిలో మరిన్ని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఆమెను వరించే అవకాశముంది. ఒక నటిగా మాత్రమే కాదు… భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటీమణుల జాబితాలో సాయి పల్లవి పేరు మరింత బలంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సాయి పల్లవి… సీత పాత్రతో చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయం రాస్తుందేమో చూడాలి!

