వారణాసిని ధారాదత్తం
చేసిన సుబ్బారెడ్డి
దర్శకుడు సుబ్బారెడ్డి తన వద్ద రిజిస్టర్ అయిన ‘వారణాసి’ సినిమా టైటిల్‌ను దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రానికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్ ల సమక్షంలో దర్శకుడు సుబ్బారెడ్డి టైటిల్ పత్రాన్ని నిర్మాత కె.ఎల్. నారాయణకు అందించారు.
ప్రశంసించారు. రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గేయరచయిత చంద్రబోస్‌లకు తన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘వారణాసి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు!!

