HomeEntertainmentశ్రీకారం చుట్టుకున్న సుక్కు - చెర్రీల చిత్రం

శ్రీకారం చుట్టుకున్న సుక్కు – చెర్రీల చిత్రం

- Advertisment -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఘనంగా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా సినిమా హైదరాబాద్‌లో సంప్రదాయబద్ధంగా జరిగిన పూజా ముహూర్తంతో ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు, దిల్ రాజుతో కలిసి స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. టీ-సిరీస్‌ భూషణ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

రామ్ చరణ్, సుకుమార్ కలయికలో మరో కొత్త అధ్యాయానికి ఈ ప్రారంభోత్సవం నాంది పలికింది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ పూర్తిగా కొత్తగా మారబోతున్నారు. సుకుమార్ ఆయనను మునుపెన్నడూ చూడని విభిన్నమైన అవతార్‌లో చూపించనున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, విజయ ప్రసాద్ బండ్రెడ్డి, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments