HomeEntertainmentరాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన నిసా ఎంటర్ టైన్ మెంట్స్,...

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.3 మూవీ

- Advertisment -

సాయి సోహన్, విస్మయ శ్రీ , విష్ణు ఓయ్, నరేంద్ర రవి, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ ఆరె మైసమ్మ టెంపుల్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ బ్యానర్స్ తమ ప్రొడక్షన్ నెం.3 చిత్రంగా నిర్మిస్తున్నాయి. క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు జి.మధుసూధన్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్స్ అనిల్ – భాను, “రోమాంచికం” చిత్ర దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో

దర్శకుడు జి.మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ – ఈ రోజు మా చిత్ర పూజా కార్యక్రమాలకు అతిథిగా వచ్చి క్లాప్ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, కెమెరా స్విచ్ఛాన్ చేసిన పబ్లిసిటీ డిజైనర్స్ అనిల్ భాను, దర్శకుడు వేణుగోపాల్ రెడ్డికి థ్యాంక్స్. మా సినిమాను క్రైమ్ కామెడీ జానర్ లో మంచి ఎంటర్ టైన్ మెంట్ తో రూపొందిస్తున్నాం. మూవీని ప్రొడక్షన్ వ్యాల్యూస్ లో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే మా సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వెల్లడిస్తాం. అన్నారు.

నటీనటులు – సాయి సోహన్, విస్మయ శ్రీ , విష్ణు ఓయ్, నరేంద్ర రవి, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్ , తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – స్మిత రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ – భవిష్య
పబ్లిసిటీ డిజైన్స్ – అనిల్ – భాను
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- ఎడ్వర్డ్ పేరేజి
ఎడిటర్ – రవితేజ గిరిజాల
డీవోపీ – మహిరెడ్డి పండుగుల
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
బ్యానర్స్ – నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్
కో ప్రొడ్యూసర్స్ – శ్రీరామ్ రెడ్డి గార్లపాటి, సురేష్ బొమ్మెర, నవీన్ మునిగాల
ప్రొడ్యూసర్స్ – నిశాంక్ రెడ్డి కుడితి, మహేందర్ రెడ్డి తిగుళ్ల
స్క్రిప్ట్, డైరెక్షన్ – జి.మధుసూధన్ రెడ్డి
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments