HomeEntertainment"దీవాన" మీ మనసును హత్తుకునే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ

“దీవాన” మీ మనసును హత్తుకునే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ

- Advertisment -

“దీవాన” సినిమాను ఎంత నిజాయితీగా రూపొందించారో ట్రైలర్ తోనే తెలుస్తోంది – మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. “దీవాన” సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్, ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

ఎడిటర్ హృషికేశ్ పాస్పల్ మాట్లాడుతూ – మా మూవీ ట్రైలర్ లాంఛ్ కు గెస్ట్ లుగా వచ్చిన అరవింద్ గారికి, విశ్వక్ అన్నకు థ్యాంక్స్. ఇది నాకు ఫస్ట్ మూవీ. ఈ చిత్రానికి వర్క్ చేసే అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్. “దీవాన” చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంటామనే నమ్మకంతో ఉన్నాం. అన్నారు.

డీవోపీ వంశీ పచ్చిపులుసు మాట్లాడుతూ – ముందుగా మా ప్రొడ్యూసర్స్ వాసు గారికి, శ్రీదేవి గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. బ్రిలియంట్ యాక్టర్స్ ను మాకు ఇచ్చారు. “దీవాన” మూవీ మీ అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ మాట్లాడుతూ – మా మూవీలోని సాంగ్స్ కు ఛాట్ బస్టర్స్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఫస్ట్ మా సినిమాలోని ఇది ప్రేమా ఇది ప్రేమా పాట పెద్ద హిట్ చేశారు. రీసెంట్ గా తెల్లపోరి సాంగ్ ను వైరల్ చేశారు. మనసును పిండే మ్యూజిక్ కావాలని మా డైరెక్టర్ అడిగారు. ఈ సినిమాకు మ్యూజిక్ చేసే క్రమంలో కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టాను. కథలోని అన్ని ఎమోషన్స్ ను నా మ్యూజిక్ ద్వారా ఆడియెన్స్ కు అందించే ప్రయత్నం చేశాను. మా “దీవాన” సినిమా మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్టర్ నర్సింగ్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. మా డైరెక్టర్ శ్రీకాంత్ గారు వన్ సైడ్ లవ్ అంటే ఎంటో చూపించబోతున్నారు. నేను హైదరాబాద్ లో ఫ్రెండ్స్ తమ స్నేహితుల కోసం ఎంతదాకా వెళ్తారు అనేది నా క్యారెక్టర్ లో చూపించబోతున్నా. విశ్వక్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నా మూవీ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా చేస్తున్న క్రమంలో నాకు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ శ్రీకాంత్ అన్న ఎంతో సపోర్ట్ ఇచ్చారు. అన్నారు.

యాక్టర్ టోనీ మాట్లాడుతూ – గీతా ఆర్ట్స్ లో వచ్చిన ఎన్నో చిత్రాలను థియేటర్ లో చూసి ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఆ సంస్థ కొలాబ్రేట్ అయిన మూవీలో నటించడం గర్వంగా ఉంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ లో బాగా పర్ ఫార్మ్ చేసేందుకు డైరెక్టర్ శ్రీకాంత్ అన్న కావాల్సినంత సపోర్ట్ అందించారు. అన్నారు.

ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ – చిన్నప్పటి సినిమా అంటే ప్యాషన్ ఉండేది. ఎన్నో చిత్రాలు చూస్తూ పెరిగాను. అరవింద్ గారితో పరిచయం అయ్యాక ఆయనకు ప్రతి రోజూ ఏదో విషయంలో థ్యాంక్స్ చెబుతూనే ఉన్నాను. ఆయనకు కృతజ్ఞత చెప్పేందుకు మాటలు సరిపోవు. విశ్వక్ తన వారు అనుకుంటే ఎలాంటి సందర్భంలోనైనా మనకోసం నిలబడతారు. ఆయన డైరెక్షన్, ప్రొడక్షన్, యాక్టింగ్..ఇలా వెర్సటైల్ టాలెంట్ చూపిస్తున్నారు. ఈ సినిమాకు ఏదైనా ఇబ్బంది ఏర్పడితే దాన్నుంచి బయటపడేందుకు విశ్వక్ గారే ఇన్స్ పైర్ చేసేవారు. ధీరజ్ మొగిలినేని గారు ఈ సినిమాకు చాలా విషయాల్లో సజెషన్స్ ఇచ్చారు. ఒకరకంగా ఈ మూవీతో ట్రావెల్ చేశారు. దీవాన సినిమాలో వన్ సైడ్ లవ్ చూపిస్తున్నాం. ఈ ప్రేమ, నాకు సినిమా మీద ఉన్న ప్రేమ ఒకేలా అనిపించింది. ఒకరోజు సెట్ లో షూటింగ్ బాగా జరిగితే హ్యాపీగా ఫీలయ్యేవాడిని. ఏదైనా ఇబ్బంది వస్తే డిజప్పాయింట్ అయ్యేవాడిని. ఆకలి, నిద్ర కూడా గుర్తుకు వచ్చేది కాదు. సినిమా మేకింగ్ కూడా లవ్ లో ఉన్నట్లు అనిపించింది. ఏదైనా సినిమాతో హిట్ కొడుతున్నాం అనే హోప్ మాత్రం ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందించేది. దీవాన ఒక బ్యూటిఫుల్ ఫిలిం. ఇన్ సైడ్ ఎమోషన్స్ మీరు ట్రైలర్ లో చూశారు. ఔట్ సైడ్ దీవాన ఏంటంటే శ్రీకాంత్ డైరెక్టర్ కావాలనే ఇరవై ఏళ్ల కలను దీవాన నిజం చేసింది. మా టీమ్ లోని ఎంతోమంది సినిమా కలను నిజం చేసింది దీవాన. ఈ సినిమా చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ చేసింది హర్షిత్ కే. ఈ దీవాన మూవీ నాకు ఎంత ముఖ్యమో, హర్షిత్ తో ఈ జర్నీ అంత ముఖ్యం అనిపించింది. ఇప్పుడు మూవీ కంప్లీట్ చేసి ఈ వేదిక మీద నిల్చోవడం ఎమోషనల్ గా ఉంది. ఈ సినిమా ఇంటర్వెల్ టైమ్ కే ఆ ఫీల్ లో ఉండిపోతారు. సినిమా పూర్తయ్యేసరికి ఒక ఎమోషన్ కు గురవుతారు. అన్నారు.

ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ – నేను ఆహాలో పనిచేశాను. అక్కడ విశ్వక్ గారిని కొన్నిసార్లు కలిశాను. కొత్త వాళ్లతో కూడా ఆయన ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. “దీవాన” సినిమా గురించి చెప్పాలంటే ఈ చిత్రానికి మా డైరెక్టర్ శ్రీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్, హీరోయిన్ స్మేహ, హీరో హర్షిత్ నాలుగు ఫిల్లర్స్. ఈ ఫిల్లర్స్ కు పునాదిలా నిలబడ్డారు మా ప్రొడ్యూసర్ వాసుదేవ్. ఆయన ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. మాకు ఇలాంటి బ్యూటిఫుల్ మూవీ ఇచ్చినందుకు వాసుకు థ్యాంక్స్ చెబుతున్నాం. వాసుదేవ్ నా ఫ్రెండ్, నా ఫ్యామిలీ. మా సినిమా ఏ జానర్ అంటే గుండెల్ని పిండేసే జానర్ అని చెబుతాను. ఈ సినిమాలో మా మున్నా, అమ్ము ఫస్ట్ సీన్ నుంచి నవ్విస్తారు, ఏడిపిస్తారు, లవ్ లో పడేలా చేస్తారు. చివరకు వీళ్లు త్వరగా కలిస్తే బాగుండును అని లోపల నుంచి ఫీల్ అయ్యేలా చేస్తారు. సినిమా పూర్తయ్యాక డైరెక్టర్ ఎంత బాగా సినిమా తీశాడ్రా అనిపిస్తాడు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్. ఈశ్వర్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ అంటే ఎవరూ నమ్మరు. అంత బాగా సంగీతాన్ని అందించాడు. అరవింద్ గారు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆయన దగ్గర ఆరున్నర ఏళ్లు పనిచేశాను. ఒక లెజెండ్ దగ్గర వర్క్ చేసిన హ్యాపీనెస్ కలిగింది. మేమంతా ప్రాణం పెట్టి సినిమా చేశాం. ట్రైలర్ మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ నెల 19న థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – మేము ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను చిన్న బడ్జెట్ లో కొత్త వాళ్లతో చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అనుకున్న హీరో హర్షిత్. ఆ తర్వాత కాస్టింగ్ మారిపోయింది. హర్షిత్ చిన్న చిత్రాలతోనే మంచి విజయాలు సాధిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. గీతా ఆర్ట్స్ అంటే మా హోమ్ బ్యానర్. అరవింద్ గారు మాకు వెన్నంటే ఉంటారు. విశ్వక్ లాంటి స్టార్ ఈ సినిమాకు సపోర్ట్ గా నిలవడం సంతోషంగా ఉంది. ప్రొడ్యూసర్స్ వాసు, శ్రీదేవి గార్లు ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషన్ తో నిర్మించారు. ఎక్కడా రాజీ పడకుండా అనుకున్నదాని కంటే ఎక్కువే ఖర్చు చేశారు. వాళ్ల ప్యాషన్ కు తప్పకుండా సూపర్ హిట్ కొడతారు. అన్నారు.

డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ – అరవింద్ గారు నాకు దైవంతో సమానం. విశ్వక్ అన్న చేసిన ఫంకీ మూవీ నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో ఆయన పర్ ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. నా సక్సెస్ ను మా నాన్నగారు చూడలేకపోయారు. మనం ఏం సాధించినా పేరెంట్స్ ఉన్నప్పుడే సాధించాలి. వీడు ఎలాగైనా బతక్కగలడు అనే ధీమా పేరెంట్స్ లో కలిగించడమే సాధించడం అంటే. దీవాన సినిమాలో అమ్మాయి, అబ్బాయి, వన్ సైడ్ లవ్ తో పాటు ఈక్వల్ గా పేరెంట్స్ లవ్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ లవ్ ఉంటుంది. ఈ సినిమా అందరికీ నచ్చేలా హోల్ సమ్ గా ఉంటుంది. నేను అరవింద్ గారికి, శ్రీదేవి గారికి, వాసు గారికి స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఎప్పుడు సినిమా చేద్దామని అన్నారంటే ఈ కథలోని హోల్ సమ్ నెస్ కారణం. ఈ సినిమా మీ టైమ్ కు, మీ సెన్స్ కు, మీ టేస్ట్ కు రెస్పెక్ట్ ఇస్తుంది. సినిమాలు చూడాలనే లవ్ ను మళ్లీ పుట్టించే సినిమా దీవాన. అరవింద్ గారు, శ్రీదేవి, వాసు .. వీళ్లే ఈ సినిమాకు ప్లాట్ ఫామ్. హర్షిత్, స్మేహ బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు. అలాగే తెలంగాణ నుంచి ఓ పది మంది యాక్టర్స్ ను తీసుకున్నాం. వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు వంటి మంచి కాస్టింగ్ ఉన్నారు. మీరు ఈ సినిమా బిగ్ స్క్రీన్ లోనే చూడాలి అనేలా ఉంటుంది. అన్నారు.

హీరోయిన్ స్మేహ మణిమేగలై మాట్లాడుతూ – దీవాన సినిమాలో అమ్ము అనే బ్యూటిఫుల్ క్యారెక్టర్ లో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అరవింద్ గారి లాంటి లెజెండ్ ముందు మాట్లాడటం ఎంతో గర్వంగా ఉంది. విశ్వక్ గారు ఎంతోమందికి ఇన్స్ పిరేషన్ గా నిలుస్తారు. దీవాన సినిమాపై మీరు ఇప్పటిదాకా ఎంతో లవ్ చూపిస్తున్నారు. అదే ప్రేమను థియేటర్స్ లో కూడా చూపిస్తారని ఆశిస్తున్నాను. తెల్లపోరి సాంగ్ హిట్ అయినప్పుడు నన్ను తెల్లపోరి అని పిలిచారు. ఇప్పుడు మీ తెలుగు అమ్మాయిని అయ్యాను. హర్షిత్ తో కలిసి నటించడం హ్యాపీగా ఫీలయ్యా. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. సినిమా అంతా రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది. ఈ నెల 19న థియేటర్స్ లో మా మూవీ చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నా. అన్నారు

హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ – విశ్వక్ అన్నను చూసినప్పుడు మనం కూడా మన సినిమా కలను నిజం చేసుకోవచ్చు అనే నమ్మకం కలిగింది. గీతా ఆర్ట్స్ తో అసోసియేట్ అయినప్పుడే మా దీవాన సినిమా సూపర్ హిట్ అనే కాన్ఫిడెన్స్ ఏర్పడింది. అరవింద్ గారు నన్ను అప్రిషియేట్ చేసిన సందర్భం మర్చిపోలేను. ఈ సినిమా ప్రమోషన్స్ లో నా కాన్ఫిడెన్స్ చూసి అందరూ సినిమా మీద బాగా నమ్మకం పెట్టుకున్నట్లు ఉన్నావు అని అడిగారు. మనం మంచి సినిమా చేసినప్పుడు అంతే కాన్ఫిడెన్స్ తో మాట్లాడాలి కదా. అందుకే మాది మంచి సినిమా అని గట్టిగా చెబుతున్నా. దీవాన సినిమా ఏ ట్రెండ్ ఫాలో కాదు, ఏ రిఫరెన్స్ ను తీసుకోలేదు, ఏ ఫార్ములాను ఉపయోగించలేదు. మేము ఈ సినిమా కోసం తీసుకున్న పాయింట్ తెలుగు సినిమాల్లో ఇప్పటిదాకా రాలేదు. ట్రైలర్ లో మీరు చూసింది అంతా బాగుంది గానీ సినిమాలో మ్యాటర్ వేరేగా ఉంటుంది. ఇప్పటిదాకా తెలుగులో ఇలాంటి కథ రాలేదు అనేదే మా కాన్ఫిడెన్స్. ఈ సినిమా ఎప్పుడూ చేసినా వర్కవుట్ అవుద్ది. ఇది టైమ్ లెస్ లవ్ స్టోరీ. ఫ్యూర్ లవ్ స్టోరీ. ఆర్య చిత్రంలా ఇది టైమ్ లెస్ లవ్ స్టోరీ. ఎప్పుడు చూసినా కొత్తగా ఉండి ఆకట్టుకుంటుంది. కథ విన్నప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు చేద్దామా అనే ఉత్సాహంలో ఉన్నాం. ఈ సినిమా చేస్తూ నవ్వుకున్నాం, ఏడ్చాం, తిట్టుకున్నాం, దీవాన అయిపోయాం. అందుకే ఈ సినిమాకు దీవాన అనే టైటిల్ పెట్టాం. దీవాన అరుదుగా వచ్చే సినిమా, ఇలాంటి ఎక్సిపీరియన్స్ యూనిక్ గా ఉంటుంది. అన్నారు

మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ – సినిమా బాగున్నప్పుడే టీమ్ మొత్తం కాన్ఫిడెంట్ గా ఉంటారు. అలాంటి కాన్ఫిడెన్స్ దీవాన మూవీ టీమ్ లో కనిపిస్తోంది. హర్షిత్ నిజాయితీ గల నటుడు. మా దిల్ సుఖ్ నగర్ ఏరియా నుంచి వచ్చాడు. బయట హర్షిత్ ను ఈ మధ్య చూస్తుంటే దీవాన లా తిరుగుతున్నాడు. ఇప్పుడు అర్థమైంది హర్షిత్ బయట కూడా ఈ సినిమా మూడ్ లోనే ఉండిపోయాడు. వాసు, శ్రీదేవి గారు చాలా ప్యాషనేట్ గా ఈ సినిమా నిర్మించారు. శ్రీకాంత్ గారు ఎంత నిజాయితీగా సినిమా రూపొందించారో ట్రైలర్ లో తెలుస్తోంది. దీవాన సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ – కొత్త వాళ్లు చాలా మంది వచ్చి కథలు చెబుతుంటారు. అలా శ్రీకాంత్ గంటన్నర కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. ప్రొడ్యూసర్ వాసుకు ఫోన్ చేసి కథ చెప్పినంత బాగా సినిమా తీస్తాడో లేదో ముందు ఒక సీన్ డెమో తీయమను, ఆ సీన్ నాకు చూపించండి అన్నాను. ఒక సీన్ చేసి ఫుటేజ్ నాకు చూపించారు. అన్ని ఎమోషన్స్ ఎలా ఉండాలో అలా రూపొందించాడు. ఇతను దర్శకుడిగా పేరు తెచ్చుకుంటాడు అనే నమ్మకం అప్పుడే నాలో కలిగింది. హీరో హర్షిత్ సహా ప్రతి ఆర్టిస్ట్ దగ్గర మంచి పర్ ఫార్మెన్స్ తీసుకున్నాడు శ్రీకాంత్. హర్షిత్ సినిమాలో పర్ ఫార్మెన్స్ చించి వదిలేశాడు. క్లైమాక్స్ లో మనతో కన్నీళ్లు పెట్టిస్తాడు. హర్షిత్ అంత మంచి యాక్టర్. ఆమిర్ ఖాన్ పెద్ద హైట్ కాదు కానీ నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. హర్షిత్ కూడా అలాగే గుర్తింపు తెచ్చుకోవాలి. హర్షిత్ కు మంచి కెరీర్ ఉంటుంది. హీరోయిన్ స్మేహ సినిమాలో చాలా క్యూట్ గా ఉంది. తెలుగులో ఆమెకు మంచి అవకాశాలు వస్తాయి. శ్రీదేవి, వాసు ఆహాలో వర్క్ చేశారు. ఆహా ఫస్ట్ ఇయర్ నేను రెగ్యులర్ గా రోజూ వెళ్లేవాడిని. వీళ్లతో డిస్కషన్స్ జరిగేవి. అలా వీళ్లు నాకు దగ్గరయ్యారు. ఈ కథ విన్నాక సినిమా చేయండని చెప్పాను. కొంత ఎక్కువ ఖర్చైనా బాగా కష్టపడి మంచి సినిమా చేశారు. దీవాన సినిమాను బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దినందుకు శ్రీదేవి, వాసుకు కంగ్రాట్స్ చెబుతున్నా. దీవాన సున్నితంగా ప్రారంభమై మన హృదయాల్లోకి చొచ్చుకెళ్లే ప్రేమ కథ. డీసెంట్ గా ఉంటుంది. ఈ సినిమాను మీడియా మిత్రులు బాగా ప్రమోట్ చేయాలని కోరుతున్నా. అన్నారు.

నటీనటులు – హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ – మానస
ప్రొడక్షన్ డిజైనర్ – ఝాన్సీ గోజల
ఎడిటర్ – హృషికేశ్ పాస్పల్
డీవోపీ – వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్ – ఈశ్వర్ చంద్
డిజిటల్ మార్కెటింగ్ – హౌస్ ఫుల్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్స్ – వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
స్క్రిప్ట్, డైరెక్షన్ – శ్రీకాంత్ సంగిశెట్టి

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments