థియేటర్లలోకి రాకముందే ‘సింగ్ గీతం’ కథ దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిపై బలమైన ముద్ర వేసింది. నిర్మాత నాగ్ అశ్విన్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో రాజమౌళి, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు విజన్, అలాగే ఈ యూనిక్ మ్యూజికల్ ఫాంటసీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంతేకాదు ఈ చిత్రం తొలి టికెట్ రాజమౌళి కొనుగోలు చేశారు.
రాజమౌళి మాట్లాడుతూ.. “ఈ కథను మొదటిసారి విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అది పూర్తిగా కొత్తగా, ఎవరికీ తట్టని ఆలోచనగా అనిపించింది. ఇంత వినూత్నమైన, సాహసోపేతమైన కథను తెరపైకి తీసుకురావడానికి కూడా అంతే వినూత్నంగా ఆలోచించే వ్యక్తి కావాలి. ఆ పని చేయడానికి నాగ్ అశ్విన్ సరైన వ్యక్తి” అన్నారు!!

