HomeEntertainmentఎల్లమ్మ - పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులతో

ఎల్లమ్మ – పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులతో

- Advertisment -

హైదరాబాద్ నగరానికే కాదు… యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న చారిత్రక, ఆధ్యాత్మిక మహా పుణ్యక్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ దేవాలయం. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం ప్రతి ఏడాది బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులతో కళకళలాడుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతుంటారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సైతం ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ క్షేత్ర విశిష్టతకు నిదర్శనం.
ఇలాంటి పవిత్ర క్షేత్రంలో అమ్మవార్ల దివ్య ఆశీస్సులతో తన ప్రచార ప్రయాణాన్ని ప్రారంభించింది ప్రముఖ దర్శక నిర్మాత ఎం.ఎస్. రాజు రూపొందించిన అత్యంత ప్రతిష్ఠాత్మక తెలుగు చిత్రం ‘అగధ’. ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్ పతాకం పై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14, 2026న భారీ స్థాయిలో ‘అగధ’ విడుదల కానుంది!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments