రాజా ది రాజా’ చిత్రం మూవీ లవర్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు. వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను జూలై 17న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రావడం విశేషం. దీంతో సినిమా మరింత గ్రాండ్ గా ప్రేక్షకులను చేరుకునే అవకాశం లభించనుంది!!

