Saturday, December 6, 2025
HomeNewsప్రజాకవి అందేశ్రీ మృతిపై స్పందించిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి

ప్రజాకవి అందేశ్రీ మృతిపై స్పందించిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి

- Advertisment -

ప్రజాకవి అందేశ్రీ మృతి పై స్పందించిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ

ప్రజాకవి అందేశ్రీ మరణం కేవలం తెలంగాణ సమాజానికే కాదు యావత్ ప్రపంచ తెలుగు జాతికి తీరని లోటు

ఆయన… నా చిత్రాలు ఊరు మనదిరా, ఎర్ర సముద్రం, వేగు చుక్కల కు అమోఘ మైన పాటలు ఇచ్చి చిత్ర విజయాలకు ఎంతో దోహదం చేశారు

ఎర్ర సముద్రం లో మాయమైపోతున్నాడు అమ్మ మనిషి అన్న వాడు అనే పాట తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ముద్రించబడింది అది ఆ పాట గొప్పతనం

ఊరు మనదిరా లోని చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి అనే పాట తెలంగాణా ఉద్యమంలో అమోఘమైన రోల్ ప్లే చేయడమే కాదు నాటికి నేటికి ఏ నాటికి చిరస్థాయిగా వుంటుంది అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అనే పాట కూడా…

అన్నిటినీ మించి జయ జయహే తెలంగాణా పాట తో ఆయన జన్మ ధన్యం చేసుకున్నారు

ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించి అమలు చేస్తున్నది.

భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి అని ప్రార్థిస్తున్నాను

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments