మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు. నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న మూడవ సింగిల్ ‘హల్లల్లల్లో”ని భోపాల్‌లో జరిగిన ‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్ లో లాంచ్ చేశారు.
ఏఆర్ రెహమాన్ ఆయన బృందం ప్రత్యక్షంగా ప్రదర్శించారు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక కనీవినీ ఎరుగని రీతిలో చాలా గ్రాండ్ గా జరిగింది. ‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ…‘పెద్ది’ ప్రమోషన్స్‌ను భోపాల్ నుంచి ప్రారంభించడం నాకు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. ‘పెద్ది’ సినిమాను మేము మనసు పెట్టి తీశాం. అంకితభావంతో పని చేశాం. జూన్ 4న మీ హృదయాల్లో మాకు మంచి స్థానం కల్పిస్తారని నమ్ముతున్నాం” అని అన్నారు.

