-చరితార్థుడు
చదలవాడ శ్రీనివాసరావు
మానవతావాది అపర దానకర్ణుడు చదలవాడ శ్రీనివాసరావుగారిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ బోర్డ్ అఫ్ డైరక్టర్ గా నియమించిన శుభ సందర్భంలో తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పాలక మండలి శ్రీనివాసరావుగారిని కలిసి అభినందనలు తెలిపింది. అధ్యక్షులు బత్తుల ప్రసాదరావు ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి చదలవాడ శ్రీనివాస్ రావుగార్కి పుష్ప గుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలియ చేసారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషి చేసెందుకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుస్తానని, పరిశ్రమలో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికి అందుబాటులో ఉంటానని చదలవాడ శ్రీనివాస్ రావు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫిల్మ్ క్రిటిక్స్ పాలక మండలి సభ్యులు బాల రెడ్ది, యం గిరిధర్, చదలవాడ భరద్వాజ, ధీరజ అప్పాజీ, శ్రీమతి పర్వీన్, బాబీ, నవీన్ తదితరులు పాల్గొని చదలవాడకు శుభాకాంక్షలు తెలిపారు.
