హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా “చెన్నై లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘వదలనే..’ పాటను సోమవారం హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్స్ మాధవపెద్ది సురేష్, కల్యాణి మాలిక్, అనూప్ రూబెన్స్, హరి గౌర, మార్క్ కె రాబిన్, సింజిత్ యెర్రమల్లి, చేతన్ భరద్వాజ్, స్వీకర్ అగస్తీ, సురేష్ బొబ్బిలి, వివేక్ సాగర్, శ్రీచరణ్ పాకాల, తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మాట్లాడుతూ – బేబి సినిమా చూసిన తర్వాత సాయి రాజేశ్ ఫ్యాన్స్ లో నేనూ ఒకరిగా మారిపోయాను. ఈ సినిమా సాంగ్స్, విజువల్స్ చూస్తుంటే బేబి సినిమా స్టాండర్డ్ లోనే “చెన్నై లవ్ స్టోరీ” ఉంటుందని, ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని అర్థమవుతోంది. నా ఫ్రెండ్ మణిశర్మ చేసిన ‘వదలనే..’ పాట హాంటింగ్ గా ఉంది. ఈ పాటను మ్యూజిక్ లవర్స్, మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ వదలనే అనాలి. అంత పెద్ద విజయం సాధించాలి. ఈ చిత్రంలో ఏడు పాటలు ఉంటాయి. ఒక లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే ఇంక చెప్పక్కర్లేదు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే లవ్ స్టోరీకి ప్రాణమే సంగీతం. మ్యూజిక్ ఈ సినిమాకు చక్కగా కుదిరింది. హీరో హీరోయన్స్ కూడా ఫ్రెష్ పెయిర్ గా కనిపిస్తున్నారు. చూడటానికి బాగున్నారు. హీరో హీరోయిన్స్ ఎక్స్ ప్రెషన్స్, విజువల్స్ బాగున్నాయి. ఈ వేదిక మీద ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మిత్రులను కలుసుకోవడం సంతోషంగా ఉంది. చెన్నై లవ్ స్టోరీ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ – ఈ కార్యక్రమంలో ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. నేను చిన్నప్పుడు పాడిన మొదటి పాట మణిశర్మ గారు కంపోజ్ చేసిందే. రామ్మా చిలకమ్మా పాట నాకు చిన్నప్పుడు ఫేవరేట్ సాంగ్. ఈ వేదిక మీద ఉన్న ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కంపోజిషన్ నాకు ఇష్టం. చెన్నై లవ్ స్టోరీ మూవీకి మణి గారు సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. వదలనే పాట పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర మాట్లాడుతూ – మణిశర్మ గారి మ్యూజిక్ గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు. ఆయన పాటలు విని సంతోషించడమే. నా స్నేహితుడు రవి నంబూరి ప్యాషన్ ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. సాంగ్స్ లోని మాంటేజ్ షాట్స్ లో రవి నంబూరి విజన్ కనిపిస్తోంది. ఈ సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ – మణిశర్మ నాకు మంచి మిత్రుడు, ఫ్యామిలీ ఫ్రెండ్. చిరకాలం గుర్తుండిపోయే పాటలు చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ లో మణి ముందు వరుసలో ఉంటారు. ఎన్నో సినిమాలను మ్యూజికల్ హిట్ చేసిన ఘనత మణిశర్మది. చెన్నై లవ్ స్టోరీ చిత్రానికి ఆయన చేసిన సాంగ్స్ వింటుంటే ఈ సినిమా కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అని అర్థమవుతోంది. అనంత శ్రీరామ్ సాహిత్యం బాగుంది. కిరణ్ అబ్బవరం నేచురల్ యాక్టర్. ఆయన చేసిన మూడు సినిమాలు నేను చూశాను. శ్రీ గౌరి ప్రియ ప్రతిభ గల హీరోయిన్. ఈ ఈవెంట్ కు ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ పిలవడంలోనే దర్శక నిర్మాతల అభిరుచి తెలుస్తోంది. ఈ సినిమా టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ – మణిశర్మ గారి పాటలు వింటూ పెరిగాం. ఈ రోజు ఆయనతో కలిసి ఈ వేదిక మీద మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నా. వదలనే పాట బ్యూటిఫుల్ గా ఉంది. మణి గారి మెలొడీస్ అన్నీ చాలా బాగుంటాయి. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తీ మాట్లాడుతూ – మణిశర్మ గారి శిష్యుడిని నేను. ఆయన దగ్గర వర్క్ చేశాను. ఆయన పాటలు అంటే ఫ్యాన్ బాయ్ అయిపోతాను. ఈ సినిమాలోని తొలి ప్రేమేం తోపు కాదే పాట రిలీజైనప్పుడు నా మూవీ సాంగ్ షేర్ చేయడం పక్కన పెట్టి ఈ పాట షేర్ చేశాను. అందరినీ పిలిచి వినిపించాను. మణి గారి పాటలు అంటే నాకు అంత ఇష్టం. ఈ చిత్రంతో మరోసారి మణిగారి పాటలను అంత బ్యూటిఫుల్ గా మన ముందుకు తీసుకొస్తున్న హీరో కిరణ్ గారికి, ఇతర టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ – నేను ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా యాభై సినిమాలు కంప్లీట్ చేశాను. నా వర్క్ అంతా మణిశర్మ గారికి డెడికేట్ చేస్తున్నా. ఈ వదలనే సాంగ్ నాకు బాగా నచ్చింది. ఎప్పటికీ ఈ పాట వింటూనే ఉంటాను. చెన్నై లవ్ స్టోరీ సినిమా ఐకానిక్ మ్యూజిక్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ మాట్లాడుతూ – వదలనే సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది. మణిశర్మ గారికి నేను పెద్ద అభిమానిని. ఈ సాంగ్ బ్యూటిఫుల్ గా ఉంది. చెన్నై లవ్ స్టోరీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ – మణిశర్మ గారు తన జీవితం అంతా మ్యూజిక్ కోసమే అంకితం చేశారు. ఆయన మెలొడీ సాంగ్స్ మనసుకు హత్తుకునేలా ఉంటాయి. నాలాంటి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ ఎంతో ఎంకరేజ్ మెంట్ ఇస్తుంటారాయన. ఈ సినిమా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో కిరణ్ గారితో నేను వర్క్ చేశాను. ఆయనకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేసే మనసు ఉంది. కిరణ్ గారు ఈ చిత్రంతో హీరోగా ఇంకా పెద్ద పొజిషన్ కు వెళ్లాలని కోరుకుంటున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – మణిశర్మ గారి మ్యూజిక్ కు నేను బానిసను. ఆయన కొత్త సినిమా ఆడియో రిలీజ్ అయితే కిలోమీటర్ల కొద్ది దూరం వెళ్లి క్యాసెట్ కొని తెచ్చుకునేవాళ్లం. నాపైనే కాదు ఇక్కడున్న ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ పైన మణి గారి ప్రభావం తప్పక ఉంటుంది. నన్ను ఇలాంటి మంచి కార్యక్రమానికి పిలిచిన ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ – నేను కీ బోర్డ్ ప్లేయర్ అయ్యేందుకు మణిశర్మ గారే స్ఫూర్తిగా నిలిచారు. వదలనే పాట చాలా బాగుంది. ఈ పాటలో కిరణ్, శ్రీ గౌరి ప్రియ పెయిర్ అమేజింగ్ గా అనిపించారు. ఇంటెన్స్ లవ్ స్టోరీలా ఈ సినిమా ఉంటుందని అనిపిస్తోంది. చెన్నై లవ్ స్టోరీ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణి మాలిక్ మాట్లాడుతూ – ఎస్ కేఎన్, సాయి రాజేశ్ సినిమా అంటే బ్యూటిఫుల్ విజువల్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్ ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. చెన్నై లవ్ స్టోరీలోనూ ఆ రెండూ ఉన్నాయి. మణిశర్మ గారు వదలనే పాట అద్భుతంగా కంపోజ్ చేశారు. కిరణ్, శ్రీ గౌరి ప్రియ బాగా నటించారు. ఇమేజ్ గురించి ఆలోచించకుండా కేవలం స్క్రిప్ట్ ను ఫాలో అవుతూ ఈ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మంచి విజయం సాధించాలి. అన్నారు.
డీవోపీ డేనియల్ విశ్వాస్ మాట్లాడుతూ – డైరెక్టర్ రవి నంబూరి స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఫస్ట్ వినిపించిన సాంగ్ ఇదే. మణిగారి కంపోజిషన్ నా విజువల్స్ ను ఎంతో ఇన్స్ పైర్ చేసింది. ఈ పాట వింటుంటే మీకు కలిగే వైబ్స్ థియేటర్స్ లో చూస్తున్నప్పుడు టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సినిమా నుంచి రాబోయే కంటెంట్ కూడా మిమ్మల్ని ఇలాగే ఎగ్జైట్ చేస్తుంది. అన్నారు.
డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ – ఈ వేదిక మీద మాట్లాడాలంటే భయమేస్తుంది. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ను చూస్తుంటే ఈ వేదిక ఒక మ్యూజిక్ యాప్ లా అనిపిస్తోంది. వదలనే పాట నా కెరీర్ లో బెస్ట్ సాంగ్ గా మిగిలిపోతుంది. మణిగారికి, అనంత శ్రీరామ్ గారికి థ్యాంక్స్. నా ప్రొడ్యూసర్స్ రాజేశ్, ఎస్ కే ఎన్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – చెన్నై లవ్ స్టోరీ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ అవుతుంది. వంద కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది. అప్పటిదాకా ఆడియెన్స్ ఈ చిత్రాన్ని వదలరు. అన్నారు.
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – నేను సింగర్ కావాలని ప్రయత్నించాను. ఏ కాంపిటేషన్ కు వెళ్లినా మణిశర్మ గారి పాటలు పాడాను. అలా ఆయన నన్ను కొత్త సింగర్ గా ఇన్స్ పైర్ చేశారు. ఇప్పుడు ఆయన మ్యూజిక్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించడం గౌరవంగా భావిస్తున్నా. సంగీతానికి ప్రాధాన్యత ఉన్న చిత్రంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటించే అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్స్ రాజేశ్ గారు, ఎస్ కేఎన్ గారికి, హీరో కిరణ్ గారికి, డైరెక్టర్ రవి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఒక మ్యూజిక్ లవర్ గా ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో వేదిక షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. వదలనే పాటను మీకు హ్యాపీగా అందిస్తున్నాం. ఈ పాట ఇప్పట్లో మిమ్మల్ని వదలదు. మా చెన్నై లవ్ స్టోరీ చిత్రాన్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అన్నారు.
ప్రొడ్యూసర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ – మణిశర్మ గారి కోసం ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మా ఈవెంట్ కు వచ్చారు. వీళ్లలో ప్రతి ఒక్కరితో నేను వర్క్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా. మణిశర్మ గారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనను కలిసినప్పుడు ఈ సినిమాలో అన్ని పాటలు మెలొడీస్ కావాలని చెప్పాను. ఇటీవల కాలంలో ఆయన ఒక సినిమా అన్ని మెలొడీ సాంగ్స్ ఇవ్వలేదు. ఆయన నుంచి మెలొడీ సాంగ్స్ మిస్ అవుతున్నాం. అందుకే చెన్నై లవ్ స్టోరీ సినిమాలోని ఏడు పాటలు మెలొడీస్ కావాలని అడిగాను. అలా మేము ఆయనను రిక్వెస్ట్ చేసి చేయించుకున్న చిత్రమిది. వదలనే పాట ఇంత బాగుందంటే క్రెడిట్ మణిగారితో పాటు అనంత శ్రీరామ్ గారికి, మా డైరెక్టర్ రవికి ఇవ్వాలి. హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ లో ఈ సాంగ్ వస్తుంది. ఆ సందర్భానికి ముందు లిరిక్ రాసి, రవికి వినిపిస్తే, రవి నంబూరి డిఫరెంట్ అప్రోచ్ తో పాట రూపొందించారు. ఇలాంటి పాట తీసుకోవడానికి డైరెక్టర్ కు గట్స్ ఉండాలి. మణిగారు క ఇంటర్వ్యూలో చెప్పారు కొన్ని పాటలు ఇన్ స్టంట్ గా నచ్చుతాయి. మరికొన్ని నెమ్మదిగా ఆదరణ పొందుతాయి. అలాంటి పాటలు చిరకాలం మనసులో నిలిచిపోతాయి. వదలనే అలాంటి సాంగ్. ఇది మణిసార్ క్లాసిక్స్ లో ఒక టాప్ సాంగ్ లా ఉంటుంది. మూవీ రిలీజ్ అయ్యాక ఈ పాట మిమ్మల్ని వదలదు. ఇంటర్వెల్ ముందు, తర్వాత, సినిమా అంతా ఈ పాట ట్రావెల్ అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యాక ఒక గొప్ప పాటగా నిలిచిపోతుంది. కిరణ్ గారు ఈ పాటలో అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. ఈ లిరికల్ సాంగ్ లో ఆయన పర్ ఫార్మెన్స్ రివీల్ చేయొద్దని, అది బిగ్ స్క్రీన్ మీదే సినిమాలో ఆడియెన్స్ చూడాలని జాగ్రత్తగా ఎడిట్ చేశాం. ఈ మూవీ యాక్సెప్ట్ చేసినందుకు, ఈ పాత్రకు ప్రాణం పోసినందుకు కిరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. శ్రీ గౌరి ప్రియ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టింది. ఆమె క్యారెక్టర్ చుట్టూనే ఈ మూవీ రన్ అవుతుంటుంది. ఆమె తెలుగుమ్మాయి. మంచి సింగర్ కూడా. ఈ సినిమా అందరి మనసులు గెలవాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – చెన్నై లవ్ స్టోరీ గురించి లాస్ట్ టైమ్ చెప్పాను. నేను కూడా మీలాగే సినిమా కోసం వేచి చూస్తున్నా. త్వరగా సినిమా రిలీజ్ చేయమని మా ప్రొడ్యూసర్స్ ను అడుగుతున్నా. ఈ సినిమా ఎలాంటి విజయం అందించబోతుందో మాకు తెలుసు. వదలనే పాట గురించి చెప్పాలంటే..ఈ పాట పిక్చరైజేషన్ పాండిచ్చేరిలో చేశాం. ఒక బ్యూటిఫుల్ టెంపుల్ దగ్గర డైరెక్టర్ రవి నాకు, గౌరికి సీన్ చెప్పారు. ఆ సీన్ చెబుతున్నప్పుడు నాకు, రవికి, గౌరికి కళ్లు చెమర్చాయి. అంత ఎమోషనల్ అయ్యాం. ఈ పాటలో ఫస్ట్ వచ్చిన ఆ సీన్ విజువల్ తెలుగు సినిమాల్లో ఒక ఐకానిక్ సీన్ గా మిగిలిపోతుంది. మణిగారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. గురుతుందా, వదలనే, రాబోయో సాంగ్..ఇలా అన్ని సాంగ్స్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. ఇప్పుడు లిరికల్ గా మీకు ఎంత నచ్చుతుందో సినిమా చూసి బయటకు వచ్చాక అంతకంటే ఎక్కువగా వదలనే సాంగ్ నచ్చుతుంది. చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసి బయటకు వచ్చాక ఈ పాట హాంట్ చేస్తూనే ఉంటుంది. వదలనే సాంగ్ విన్నప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యానో ఇప్పుడు కూడా అదే ఫీల్ కలుగుతోంది. ఈ పాటను మీరంతా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ – సాయి రాజేశ్
నిర్మాతలు – ఎస్ కేఎన్, సాయి రాజేశ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి

